
Adipurush Movie
Adipurush Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతాదేవిగా నటించింది. అలాగే రావణుడు పాత్రలో రన్వీర్ సింగ్ నటించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్లు విడుదలయ్యాయి. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా 2D 3D లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది. అయితే ఊహించని విధంగా ఐమాక్స్ చూసేవారికి నిరాశ ఎదురయింది.
ఆదిపురుష్ సినిమా 3d ఐమాక్స్ ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అయ్యారు కానీ దానికి ఒక హాలీవుడ్ సినిమా బిగ్ బ్రేక్ వేయడం ఆశ్చర్య పరుస్తుంది. వార్నర్ బ్రదర్స్ నిర్మించిన హాలీవుడ్ సినిమా ది ఫ్లాష్ అదే రోజున విడుదలవుతోంది. దీంతో ఇండియా ప్రతినిధులు అన్ని ఐమాక్స్ స్క్రీన్ లను బ్లాక్ చేశారు. ఇండియాలో ఐమాక్స్ విడుదల ప్రణాళికలను నిలిపి వేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే 550 కోట్ల వరకు బిజినెస్ జరిపిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Adipurush Movie
తెలుగులో ఈ సినిమాకి బాగానే డిమాండ్ ఉన్న బాలీవుడ్ లో ఈ సినిమాకి హైప్ పెంచేందుకు అవసరమైన ప్రచారం సాగుతుంది. అలాగే అమెరికాలో తెలుగు వర్షన్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ హిందీ వర్షన్ డల్ గా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ టీం అమెరికాలో ప్రమోషన్స్ కోసం వెళుతున్నారని సమాచారం. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సినిమా బాగుంటే ప్రభాస్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. చూడాలి ఈ సినిమా ఎటువంటి టాక్ ను ఇస్తుందో.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.