
Aamani about on Soundarya
Aamani : ఒకప్పటి స్టార్ హీరోయిన్ దివంగత నటి సౌందర్యను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సినీరంగంలో చెరగని ముద్ర వేసింది. తెలుగుతో పాటు తమిల్, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. అద్బుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది. టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వీళ్ల ఇద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లోఅత్యంత విజయవంతమైన జంటగా చెప్పుకుంటారు.
కాగా సౌందర్య గ్లామర్ షోకి ఆమడ దూరంలో ఉండేది. అందాల ఆరబోత ఆమెకి ఇష్టం ఉండేది కాదు. సాంప్రదాయ చీరకట్టులో అందరినీ ఆకట్టుకునేది. 12 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో కొనసాగిన సౌందర్య ఎన్నో అవార్డులును అందుకుంది. కాగా 2004లో విమాన ప్రమాదంలో మరణించింది. బీజేపీలో ప్రచారంలో భాగంగా బెంగళూర్ నుంచి ఆంధ్రపదేశ్ వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో అభిమానులందరికీ దూరం అయ్యారు. వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలో తోటి హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తుండగా సౌందర్య మాత్రం అలా చేయలేదు. ఈ విషయాన్ని తన స్నేహితురాలు.. నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇద్దరికీ కన్నడ పాటలంటే ఎక్కువ ఇష్టమని చెప్పింది.
Aamani about on Soundarya
కాగా ఇద్దరూ కలిసినప్పుడు చిన్నపటి విషయాలు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లమని ఆమని అన్నారు. తను సినిమాల్లో కొంతమేరకు ఎక్స్ పోజింగ్ చేసినా సౌందర్య మాత్రం గ్లామర్ షో దూరంగా ఉందని చెప్పింది. ఇదే విషయమై సౌందర్యను అడిగితే.. ఎక్స్ పోజింగ్ ఎందుకు చేయాలే.. రేపు పెళ్లి అయితే తన భర్తకి కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుందని అందుకే చేయనని చెప్పినట్లు ఆమని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సౌందర్య ఉండి ఉంటే ఇంకా అద్బుతమైన పాత్రలు పోషిస్తూ మెప్పించేదని అన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.