Shivaji : బిగ్ బాస్ షో గురించి అసలు నిజాలు బయటపెట్టిన శివాజీ.. అంతా స్క్రిప్టేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shivaji : బిగ్ బాస్ షో గురించి అసలు నిజాలు బయటపెట్టిన శివాజీ.. అంతా స్క్రిప్టేనా?

Shivaji : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అసలు ఒక రైతు బిడ్డ విన్నర్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అందరూ శివాజీ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే.. ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే దానికి ప్రధాన కారణం శివాజీ అనే చెప్పుకోవాలి. శివాజీ 105 రోజులు హౌస్ లో అండగా ఉన్నాడు. శివాజీ వల్లనే ప్రశాంత్ బిగ్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  బిగ్ బాస్ షో గురించి చెప్పిన శివాజీ

  •  లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం

  •  బిగ్ బాస్ ఒక పాఠశాల

Shivaji : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అసలు ఒక రైతు బిడ్డ విన్నర్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అందరూ శివాజీ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే.. ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే దానికి ప్రధాన కారణం శివాజీ అనే చెప్పుకోవాలి. శివాజీ 105 రోజులు హౌస్ లో అండగా ఉన్నాడు. శివాజీ వల్లనే ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు అని అందరూ అంటున్నారు. అందులో డౌటే లేదు. అయితే.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత యాక్టర్ శివాజీ బిగ్ బాస్ షో గురించి చెప్పుకొచ్చాడు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని అన్న నందమూరి తారకరామారావు అంటే.. ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం, ప్రేక్షకులే సినిమా వాళ్లకు దేవుళ్లు. అలాగే నాకోసం అహర్నిశలు పని చేసినటువంటి అభిమానులు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.

బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ నా లైఫ్ లో ఒక మధురానుభూతి. ఈ పాఠశాలలోకి లైఫ్ లో ఒక్కసారే అడ్మిషన్ దొరుకుతుంది. అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకు సదా రుణపడి ఉంటాను. బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లి గొడవలు చేయాలి. స్ట్రాటజీలు ప్లే చేయాలి. అవసరం అయితే కొట్టుకునే స్థాయి దాకా కూడా వెళ్లాలి అనే దురభిప్రాయంలో ఉన్న వాళ్లందరికి కూడా కాదు. ఇది నిజంగా ఒక పాఠశాల. డిసిప్లేన్ అవసరం. మనకు లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది నేను చెప్పాలని అనుకున్నాను ఈ షో ద్వారా. ఆ అవకాశం నాకు స్టార్ మా ఇచ్చింది. ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నాగార్జున బాబు గారు ఇంత అద్భుతంగా ఆయన నుంచి హౌస్ లో జరిగే మనం చేస్తున్న మిస్టేక్స్ ను చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలెట్ గా అనిపించింది నాకు.

Shivaji : నాగార్జున ఒక మాస్టర్

ఎందుకంటే.. ఆయన ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులను, ఆర్టిస్టులను పరిచయం చేశారు. అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకు హోస్ట్ గా ఉండటం నిజంగా కంటెస్టెంట్లకు అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ సీజన్ లో కూడా బాబు గారే ఉండటం ఒక సాటి ఆర్టిస్ట్ గా చాలా గర్వంగా అనిపించింది నాకు. ఆయన ప్రతి వారం మాస్టర్ లాగా అందరికీ చెప్పడం.. అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన దేవుడు నాగార్జున. ఆయన చెప్పడం నాకు చాలా బాగా అనిపించేది. మాట్లాడుదాం అన్నా కానీ.. నేను ఎక్కడ కూడా భయపడే మనిషిని కాదు. బాబు గారి దగ్గర మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని. ఏదైనా తక్కువ మాట్లాడాలి.. ఎక్కువ మాట్లాడకూడదు అనేది నేర్చుకున్నా.. అని శివాజీ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది