Pallavi Prashanth – Shivaji : తప్పు చేస్తే ఎవ్వడికైనా ఇదే గతి పడుతుంది.. ప్రశాంత్ ఎలాంటి వాడో నాకు అప్పుడే తెలిసింది.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pallavi Prashanth – Shivaji : తప్పు చేస్తే ఎవ్వడికైనా ఇదే గతి పడుతుంది.. ప్రశాంత్ ఎలాంటి వాడో నాకు అప్పుడే తెలిసింది.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ కామెంట్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :22 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై తొలిసారి స్పందించిన శివాజీ

  •  పల్లవి ప్రశాంత్ ఏ తప్పు చేయలేదు

  •  వాడు నా బిడ్డ.. ఎప్పటికీ తప్పు చేయడు

Pallavi Prashanth – Shivaji : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలుపు తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో జరిగిన దాడి ఘటనపై పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అంతే కాదు.. ప్రశాంత్ ఇంటికి వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే.. ప్రశాంత్ అరెస్ట్ పై తాజాగా శివాజీ స్పందించారు. చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతున్నారు. ప్రశాంత్ కు ఏం కాదు. ప్రశాంత్ చట్టప్రకారం బయటికి వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్నాడు. పారిపోయాడు అని చెప్పి రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టారు. అవి కరెక్ట్ కాదు. ప్రశాంత్ ఎలాంటి వాడో నాలుగు నెలలు వాడితో ఉండి నేను చూశాను. వాడు మంచి కుర్రాడు. గెలిచాను అని చెప్పి వాడు నా వాళ్లను కలవాలి అని అనుకున్నాడు. అలా ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకు తెలియదు.

తను స్టూడియో నుంచి బయటికి రాకముందే కొందరు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు పగిలాయి. అది చాలా బాధాకరం. చేసింది ఎవరు అయినా అలా చేయడం తప్పు. ఎవరి అభిమానులు అయినా అలా చేయడం తప్పు. అమర్ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఇలాంటివి చేయడం చాలా తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశాంత్ గురించి నేను పదే పదే ప్రతి సారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ బయటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అన్ని విషయాలు తెలుసు. వాడికి నేను ఏంటో తెలుసు. నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్ట ప్రకారం ప్రశాంత్ బయటికి వస్తాడు. చట్టానికి లోబడి ఉన్న అంశం కాబట్టి చట్టానికి లోబడి అందరూ ఉండాలి కాబట్టి చట్టాన్ని అతిక్రమించారనే నెపం పెట్టారు. అది నిజమా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ప్రశాంత్ నిర్దోషిగా బయటికి వస్తాడు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు కూడా నాతో టచ్ లో ఉన్నారు. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. మనమంతా చట్టాన్ని గౌరవించాలి. అలాంటి థంబ్ నెయిల్స్ చూస్తే నాకు చాలా బాధేస్తోంది. ఎందుకు అలా పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఒకసారి మనలో మనం ఆలోచించుకోవాలి. అలాంటి థంబ్ నెయిల్స్ పెడితే కరెక్ట్ కాదు.

Pallavi Prashanth – Shivaji : ప్రశాంత్, యావర్ ఇద్దరూ నా బిడ్డల్లాంటి వారు అన్న శివాజీ

ప్రశాంత్ సేఫ్.. ప్రశాంత్ ను రేపు మనం చూస్తాం. బయట.. ప్రశాంత్ క్రిమినల్ కాదు.. నిందితుడు కాదు. ఇప్పుడు ఒక బాధితుడు. ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో అపశృతి వల్ల ప్రశాంత్ బాధపడుతున్నాడు. ఈ మూడు రోజుల నుంచి కూడా నేను హౌస్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అది మైండ్ లో నుంచి పోలేదు. నేను తట్టుకున్నాను కానీ.. ఆ వయసుకు పిల్లలు తట్టుకోలేరు. నిన్ననే యావర్ ను కూడా కలిశాను. కలిసిన ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. హౌస్ లో గేమ్ కోసం వెళ్లాం.. స్నేహితులం అయ్యాం. ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు మాత్రం కాల్ జెన్యూన్ గా ఉంటే శివాజీ అక్కడ ఉంటాడు. ప్రశాంత్ సేఫ్, యావర్ ఫైన్. ఇద్దరూ నాకు బిడ్డల్లాంటి వారు. కలకాలం మా స్నేహం ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను.. అంటూ శివాజీ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది