Acharya Movie 1st day collection
Acharya Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య. సామాజిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే నెగెటివ్ టాక్ తో ఆందోళన కలిగించింది. సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా, డల్‌గా ఉందని, సెకండ్ హాఫ్ డీసెంట్‌గా ఉందని, రెజీనా కసాండ్రా ఐటెమ్ నంబర్, క్లైమాక్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి సోల్‌గా నిలుస్తాయని అన్నారు. కొరటాల శివ కొరటాల శివ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడాన్ని విమర్శకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇప్పటి వరకు ఫెల్యూర్ లేని డైరెక్టర్ గా పేరున్న శివ ఖాతాలో ‘ఆచార్య’ కొంత నిరాశపరిచిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.ఆచార్య అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రీసెంట్ టైం లో స్టార్ హీరోల మూవీస్ అన్నింటిలోకి కూడా వీకేస్ట్ బుకింగ్స్ అని చెప్పాలి. కొన్ని చోట్ల బాగున్నా కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా అంచనాల రేంజ్ లో అయితే లేవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో యావరేజ్ రేంజ్ లో, ఆంధ్ర లో డీసెంట్ గా సినిమా ఓపెన్ అయినా కానీ సినిమా టాక్ ఇంపాక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మరింత వీక్ అయింది. ఈ క్రమంలో కలెక్షన్స్ బాగా తగ్గుతున్నాయి.హోమ్ మార్కెట్‌లో దాదాపు 1150 థియేటర్లలో విడుదలైంది ఆచార్య చిత్రం.
Acharya Movie 1st day collection
అత్యధికంగా నైజాం మరియు సీడెడ్ ఏరియా 600+ థియేటర్లు, ఆంధ్రాలో 500 థియేటర్లకు పైగా మరియు ఓవర్సీస్‌లో 650+ థియేటర్లలో విడుదలైంది. మొత్తం థియేటర్ల సంఖ్య 2000కి పైగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం 200+ థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయంటున్నారు. తొలిరోజు ఏపీ తెలంగాణలో కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం: 7.90 కోట్లు, సీడెడ్: 4.60Cr(1.75Cr అద్దెలు), UA: 3.61Cr(1Cr హైర్స్), తూర్పు: 2.53Cr(1.30Cr), పశ్చిమ: 2.90Cr(2Cr), గుంటూరు: 3.76Cr(2.25Cr), కృష్ణ: 1.90Cr(1Cr), నెల్లూరు : 2.30 కోట్లు (1.51 కోట్లు) రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయని తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
This website uses cookies.