Acharya Movie : తొలి రోజు ప‌ర్వాలేద‌నిపించిన ఆచార్య‌.. రానున్న రోజుల‌లో స‌త్తా చూపుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Acharya Movie : తొలి రోజు ప‌ర్వాలేద‌నిపించిన ఆచార్య‌.. రానున్న రోజుల‌లో స‌త్తా చూపుతుందా?

 Authored By sandeep | The Telugu News | Updated on :30 April 2022,12:02 pm

Acharya Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆచార్య. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచనాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఫ‌స్ట్ షో నుండే నెగెటివ్ టాక్ తో ఆందోళ‌న క‌లిగించింది. సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా, డల్‌గా ఉందని, సెకండ్ హాఫ్ డీసెంట్‌గా ఉందని, రెజీనా కసాండ్రా ఐటెమ్ నంబర్, క్లైమాక్స్, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకి సోల్‌గా నిలుస్తాయని అన్నారు. కొరటాల శివ కొరటాల శివ దర్శకత్వంలో ఇలాంటి సినిమా రావడాన్ని విమర్శకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇప్పటి వరకు ఫెల్యూర్ లేని డైరెక్టర్ గా పేరున్న శివ ఖాతాలో ‘ఆచార్య’ కొంత నిరాశపరిచిందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.ఆచార్య అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే రీసెంట్ టైం లో స్టార్ హీరోల మూవీస్ అన్నింటిలోకి కూడా వీకేస్ట్ బుకింగ్స్ అని చెప్పాలి. కొన్ని చోట్ల బాగున్నా కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా అంచనాల రేంజ్ లో అయితే లేవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో యావరేజ్ రేంజ్ లో, ఆంధ్ర లో డీసెంట్ గా సినిమా ఓపెన్ అయినా కానీ సినిమా టాక్ ఇంపాక్ట్ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మరింత వీక్ అయింది. ఈ క్ర‌మంలో క‌లెక్ష‌న్స్ బాగా త‌గ్గుతున్నాయి.హోమ్ మార్కెట్‌లో దాదాపు 1150 థియేటర్లలో విడుదలైంది ఆచార్య చిత్రం.

Acharya Movie 1st day collection

Acharya Movie 1st day collection

Acharya Movie : ఆచార్య‌కు నిరాశ‌..

అత్యధికంగా నైజాం మరియు సీడెడ్ ఏరియా 600+ థియేటర్లు, ఆంధ్రాలో 500 థియేటర్లకు పైగా మరియు ఓవర్సీస్‌లో 650+ థియేటర్లలో విడుదలైంది. మొత్తం థియేటర్ల సంఖ్య 2000కి పైగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం 200+ థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయంటున్నారు. తొలిరోజు ఏపీ తెలంగాణలో కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం: 7.90 కోట్లు, సీడెడ్: 4.60Cr(1.75Cr అద్దెలు), UA: 3.61Cr(1Cr హైర్స్), తూర్పు: 2.53Cr(1.30Cr), పశ్చిమ: 2.90Cr(2Cr), గుంటూరు: 3.76Cr(2.25Cr), కృష్ణ: 1.90Cr(1Cr), నెల్లూరు : 2.30 కోట్లు (1.51 కోట్లు) రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయని తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది