Actor Abbas : అబ్బాస్ అనే పేరు ఈ జనరేషన్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ, నైన్ టీస్ లో అబ్బాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. 1996 లో ఈ పేరు ఒక సంచలనం. యూత్ కు ఈయన ఫ్యాషన్ ఐకాన్. అమ్మాయిలకు అయితే కలల రాజు. ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో అబ్బాస్ కటింగే చేయించుకునేవారు. అబ్బాస్ కేవలం ఒకే ఒక్క సినిమాతో అంత ఫాలోయింగ్ వచ్చింది. అదే ప్రేమ దేశం సినిమా. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనాలు మామూలుగా లేవు. ప్రేమ దేశం సినిమాతో వినీత్ తో పాటు టబు, అబ్బాస్ కు కూడా గొప్ప పేరు వచ్చింది. ఆ తర్వాత ఆయనకు వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీకి మరో స్టార్ హీరో వచ్చేశాడని అందరూ అనుకున్నారు. మరి ఇంతలోనే ఏమైంది. అబ్బాస్ సినిమా కెరీర్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది. చివరకు అబ్బాస్ పెట్రోల్ బంక్ లో పనిచేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అబ్బాస్ పతనం రెండో సినిమా నుంచే మొదలు అయింది. ప్రేమ దేశం సినిమా ఎంతో స్టార్ డమ్ తీసుకొచ్చింది అబ్బాస్ కు. ఆ స్టార్ డమ్ తో తనకు వరుస పెట్టి అవకాశాలు రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా కథ గురించి కూడా పట్టించుకోకుండా అబ్బాస్ ఎడా పెడా సినిమాలకు ఒప్పేసుకున్నాడు. దీంతో తన మొదటి సినిమా తర్వాత మరో రెండేళ్ల వరకు ఒక్క రోజు డేట్ కూడా ఖాళీ లేకుండా సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. తనకు మొదటి సినిమా అవకాశం కూడా ప్రేమ దేశం డైరెక్టర్ కదిర్ ద్వారా అబ్బాస్ కు అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో అబ్బాస్ కూడా తన పారితోషికాన్ని పెంచాడు. కానీ, తనకు సూట్ అయ్యే పాత్రలను ఎంచుకోలేదు. ప్రతి సినిమాలోనూ రెండో హీరోగానే నటించేందుకు అవకాశాలు వచ్చాయి. డబ్బును చూసి సినిమాలు ఒప్పుకున్నాడు కానీ.. లవర్ బాయ్ పాత్రలను ఎంచుకోక గుడ్డిగా కొత్త సినిమాలకు సైన్ చేశాడు.
అలా డైరెక్టర్ శంకర్ మూవీ జీన్స్ లో హీరోగా చేసే అవకాశాన్ని అబ్బాస్ వదులుకోవాల్సి వచ్చింది.
డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ సినిమాలో హీరోగా నటించే చాన్స్ ప్రశాంత్ కు వచ్చింది. అదొక్కటే కాదు.. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన చాలా సినిమాల్లో హీరోగా అబ్బాస్ నటించాల్సింది కానీ, అబ్బాస్ కు డేట్స్ సర్దుబాటు కాక వేరే హీరోలకు ఆ సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది. ఇక, ప్రేమ దేశం తర్వాత అబ్బాస్ నటించిన చాలా సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. దీంతో తనకు అవకాశాలు సన్నగిల్లాయి. తన యాక్టింగ్ లోనూ మార్పులు చేసుకోలేదు అబ్బాస్. ఏ సినిమాలో కూడా ఏ పాత్ర చేసినా ఒకే మాదిరిగా నటించాడు అబ్బాస్. క్యారెక్టర్ కు తగ్గట్టుగా తన నటనను మార్చుకోలేకపోయాడు. దొరికిన పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయాడు. దాదాపు 60 సినిమాల్లో నటించినా అబ్బాస్ అంటే కేవలం ప్రేమ దేశం సినిమానే గుర్తొస్తుంది. పెద్ద స్టార్ కాకపోయినా మంచి సినిమాలు ఎంచుకుంటే ఇండస్ట్రీలో ఉండేవాడు.
చివరకు టీవీ సీరియల్స్ లోనూ అబ్బాస్ నటించాడు. అబ్బాస్ సీరియల్స్ లో నటించడంతో ఇక సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో పెళ్లి చేసుకొని వెంటనే సినిమా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టి న్యూజిలాండ్ కు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లాక అర్థిక పరిస్థితుల వల్ల పెట్రోల్ బంక్ లోనూ పనిచేశాడు అబ్బాస్. కొన్ని రోజులు మెకానిక్ గా, ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్ గా పనిచేసి ఆ తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టుకొని ఆర్థికంగా సెటిల్ అయ్యాడు అబ్బాస్. అలా సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయి ఒక బిజినెస్ మ్యాన్ గా అబ్బాస్ విదేశాల్లో స్థిరపడ్డాడు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
This website uses cookies.