Samantha : బ్రహ్మాజీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్‌లో ఎన్నో విషయాల మీద స్పందించాడు. తన గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్‌లో తన జీవితం ఎలా ఉండేది.. చెన్నైలో ప్రయత్నాలు చేసిన సమయంలో ఎదురైన అనుభవాలు, ఆ సమయంలో కృష్ణ వంశీతో స్నేహం, రూంలో భోజనం పెట్టడం, ఆ తరువాత తనకు అవకాశాలు ఇవ్వడం ఇలా ఎన్నెన్నో వాటిపై స్పందించాడు. అయితే తన నేచర్ గురించి చెప్పుకొచ్చాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే టైపులో ఉండటం తనకు నచ్చదని అన్నాడు.మన పని మనం చేసుకున్నామా? తిన్నామా? పడుకున్నామా? అనేది ఓ కేటగిరి.. అది చాలా సేఫ్.. కానీ నాకు అలా ఉండటం నచ్చదు..
మనం నోరు తెరిచి చెప్పాల్సిన సందర్భాలు వస్తాయి.. అలాంటప్పుడు స్పందించాల్సిందే అని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. అలా ఓ సారి సమంతను ఓ నెటిజన్ ఇష్టమొచ్చినట్టుగా అనేశాడు. నువ్ రూ. 250 కోట్లు తీసుకున్నావ్.. సెకండ్ హ్యాండ్ దానివి అంటూ ఇలా ఏదేదో పిచ్చి కామెంట్ చేశాడు. దానిపై సమంత స్పందించింది రిప్లై ఇచ్చింది. వాడు అన్న కామెంట్ చూసి నాకు బాధేసింది. సిగ్గు శరం లేదా.. ఆమెను అలా అంటావ్.. నువ్వే థర్డ్ గ్రేడ్.. ఆమెను సెకండ్ హ్యాండ్ గ్రేడ్ అని అన్నావ్. కానీ నువ్వే థర్డ్ గ్రేడ్ అని తిట్టేస్తూ ఓ ట్విట్ వేశాను.. అలా అని సమంత నాకు ఫ్రెండ్ కాదు.. ఆమె ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు.. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు..
సమంత ఎంతో కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చింది.. అలాంటి అమ్మాయిని పట్టుకుని అలా అనేసరికి నాకు చాలా బాధ వేసింది. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఆ దెబ్బతో వాడు ట్విట్టర్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకుని వెళ్లిపోయాడు అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి బ్రహ్మాజీ మాత్రం ట్విట్టర్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఆ మధ్య హైద్రాబాద్‌లో వర్షాలు,వరదలు రావడంతో వేసిన ఫన్నీ ట్వీట్ కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజులు బ్రహ్మాజీ ట్విట్టర్‌కు దూరంగా ఉండిపోయాడు. ట్విట్టర్‌లో బ్రహ్మాజీ వేసే సెటైర్లు అందరినీ నవ్విస్తుంటాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.