
Actor Naresh : యాంకర్ అడిగిన ప్రశ్నలకు సీరియస్ అయినా నటుడు నరేష్ ..!
Actor Naresh : మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ భీమా ‘. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై కేకే రాధా మోహన్ భారీగా నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో నరేష్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు .మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భీమా సినిమాను గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు దాదాపుగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భీమా సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో నటుడు నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది ప్రేక్షకులు భీమా సినిమా చూసి ఇంటర్వెల్ ఎక్సలెంట్ గా ఉందని, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ లు పెడుతున్నారు. ప్రతి సినిమాకు ఈ రెండు చాలా కీలకం..
ఇందులో విజయం సాధించిన డైరెక్టర్ హర్ష కి అభినందనలు అని నరేష్ అన్నారు. సంక్రాంతి సినిమాలా శివరాత్రి సినిమా ఉంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్ కి హ్యాట్సాఫ్ అని నరేష్ అన్నారు. ఇక నిర్మాత కేకే రాధా మోహన్ సినిమా చాలా రిచ్ గా తీశారని ప్రతి ఒక్కరు థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇదని, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని భీమా సక్సెస్ మీట్ లో నరేష్ తెలిపారు. ఇంత మంచి ప్రాజెక్టుని నా వద్దకు తీసుకువచ్చిన సహానిర్మాత శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు అని, ఇంత మంచి ప్రాజెక్టును చేసే అవకాశం ఇచ్చిన గోపిచంద్, డైరెక్టర్ హర్ష కి ధన్యవాదాలు అని నిర్మాత కేకే రాధా మోహన్ అన్నారు.
రవి బస్రూర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలెట్గా నిలిచిందని, గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారని, మా ప్రొడక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని నిర్మాత రాధా మోహన్ తెలిపారు. ఇదిలా ఉంటే భీమా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ యాక్షన్ అదిరిపోయాయని మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అన్ని రివ్యూలు వచ్చాయి. ఇక గోపీచంద్ రెండు పాత్రల్లో కనివిందు చేశాడని అంటున్నారు. యాక్షన్ మూవీకి మైథాలజికల్ టచ్ ఇచ్చి భీమాని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక గోపీచంద్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.