Actor Naresh : యాంకర్ అడిగిన ప్రశ్నలకు సీరియస్ అయినా నటుడు నరేష్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actor Naresh : యాంకర్ అడిగిన ప్రశ్నలకు సీరియస్ అయినా నటుడు నరేష్ ..!

 Authored By tech | The Telugu News | Updated on :14 March 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Actor Naresh : యాంకర్ అడిగిన ప్రశ్నలకు సీరియస్ అయినా నటుడు నరేష్ ..!

Actor Naresh  : మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘ భీమా ‘. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై కేకే రాధా మోహన్ భారీగా నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో నరేష్, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు .మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భీమా సినిమాను గ్రాండ్ గా విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు దాదాపుగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ భీమా సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో నటుడు నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది ప్రేక్షకులు భీమా సినిమా చూసి ఇంటర్వెల్ ఎక్సలెంట్ గా ఉందని, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ అని మెసేజ్ లు పెడుతున్నారు. ప్రతి సినిమాకు ఈ రెండు చాలా కీలకం..

ఇందులో విజయం సాధించిన డైరెక్టర్ హర్ష కి అభినందనలు అని నరేష్ అన్నారు. సంక్రాంతి సినిమాలా శివరాత్రి సినిమా ఉంటుంది. భీమా శివరాత్రి సినిమా. థియేటర్స్ దద్దరిల్లాయి. రెండు పాత్రలు పండించడం చాలా కష్టం. గోపీచంద్ చాలా అద్భుతంగా పండించారు. గోపీచంద్ కి హ్యాట్సాఫ్ అని నరేష్ అన్నారు. ఇక నిర్మాత కేకే రాధా మోహన్ సినిమా చాలా రిచ్ గా తీశారని ప్రతి ఒక్కరు థియేటర్స్ లో ఎంజాయ్ చేసే మాస్ సినిమా ఇదని, సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అని భీమా సక్సెస్ మీట్ లో నరేష్ తెలిపారు. ఇంత మంచి ప్రాజెక్టుని నా వద్దకు తీసుకువచ్చిన సహానిర్మాత శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు అని, ఇంత మంచి ప్రాజెక్టును చేసే అవకాశం ఇచ్చిన గోపిచంద్, డైరెక్టర్ హర్ష కి ధన్యవాదాలు అని నిర్మాత కేకే రాధా మోహన్ అన్నారు.

రవి బస్రూర్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి హైలెట్గా నిలిచిందని, గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారని రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వెంకట్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారని, మా ప్రొడక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని నిర్మాత రాధా మోహన్ తెలిపారు. ఇదిలా ఉంటే భీమా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అలాగే సినిమాకు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ యాక్షన్ అదిరిపోయాయని మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ అన్ని రివ్యూలు వచ్చాయి. ఇక గోపీచంద్ రెండు పాత్రల్లో కనివిందు చేశాడని అంటున్నారు. యాక్షన్ మూవీకి మైథాలజికల్ టచ్ ఇచ్చి భీమాని తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక గోపీచంద్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది