Actor Naresh Son : రామ్ చరణ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actor Naresh Son : రామ్ చరణ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :4 February 2024,6:00 pm

Actor Naresh Son : సీనియర్ నటుడు నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నానమ్మ, తల్లి ఆశించిన స్థాయిలో ఉండలేకపోయానని బాధతో ఇన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాను నవీన్ ఎమోషనల్ అయ్యారు.సుప్రీం హీరో సాయి ధరంతేజ్, కలర్స్ స్వాతి జంటగా నవీన్ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫీచర్ సత్య. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత దీన్ని నిర్మించారు. అయితే ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ సత్య అనే మ్యూజికల్ షాట్ ను మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ జీవితంలో ముందుకు వెళ్లడం ఎంతో ముఖ్యం.

నేను ముందుకు రావడానికి నా ధైర్యం నా మనసులో ఉన్న కీర్తిశేషులు మా నానమ్మ విజయనిర్మల, మా అమ్మ నేత్ర. వీళ్ళిద్దరు ఎప్పుడు నన్ను జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. అది ఇవ్వలేకపోయాననే బాధలో ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను సత్య చేశాను అంటే దానికి వాళ్లే కారణం. సత్య కాన్సెప్టు రాసినప్పుడు, తీసినప్పుడు ఎమోషన్ మాత్రమే గుర్తు ఉంది. ఎవరినైనా మనం మిస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందనే విషయాన్ని శృతి రంజని అందమైన ట్యూన్ గా మలిచారు. దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. దానికి న్యాయం చేయాలనేదే సత్య క్రియేట్ అయింది. నా బెస్ట్ ఫ్రెండ్ హర్షిత్ రెడ్డి నాకు ఈ సత్యను దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. సత్య అనేది నా జీవితం నాదే కాదు చాలామంది జీవితాలకు సంబంధించింది.

హర్షిత్, హన్షిత యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. సత్య మ్యూజికల్ షాట్ కోసం చాలామంది కష్టపడ్డారు. తేజ్ కి థాంక్స్ చెప్పాలి. గుడ్డి నమ్మకంతో తేజ్ నటించారు. తన నమ్మకం చూసి నాకు భయమేసింది కానీ తను ఏమాత్రం ఆలోచించకుండా సపోర్ట్ చేశారు. అలాగే మా సాంగ్ ను లాంచ్ చేసినా రామ్ చరణ్ కి థాంక్స్. రామ్ చరణ్ స్కూల్లో నా క్లాస్ మేట్ కాకపోతే చరణ్ మధ్యలో ఊటీకి వెళ్లిపోవడంతో మా మధ్య గ్యాప్ వచ్చింది అని నవీన్ చెప్పుకొచ్చారు. దీంతో రామ్ చరణ్ నవీన్ క్లాస్ మెట్స్ అని తెలుస్తుంది. దీంతో రామ్ చరణ్ గురించి వ్యాఖ్యలు చేసిన నవీన్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది