Telugu Actor : కోట్ల ఆస్తి ఉన్నా కూతుర్లకు రూపాయి కట్నమివ్వని యాక్టర్ ఎవరో తెలుసా!
Telugu Actor : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతమున్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే గతంలో సినిమాల్లో కొనసాగిన యాక్టర్స్ తీసుకున్న మొత్తం చాలా తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకు గంటల చొప్పున రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. ఇక హీరోల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఒక్క సినిమాకు వారు రూ. కోట్లు తీసుకుంటున్నారు. దానికి తోడు భారీ బడ్జెట్ అయితే కలెక్షన్లలో షేర్ కూడా […]
Telugu Actor : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతమున్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌తో పోలిస్తే గతంలో సినిమాల్లో కొనసాగిన యాక్టర్స్ తీసుకున్న మొత్తం చాలా తక్కువే అని చెప్పాలి. ప్రస్తుతం ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుకు గంటల చొప్పున రూ. లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. ఇక హీరోల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఒక్క సినిమాకు వారు రూ. కోట్లు తీసుకుంటున్నారు. దానికి తోడు భారీ బడ్జెట్ అయితే కలెక్షన్లలో షేర్ కూడా అడుగుతున్నారట..కానీ ఇతరులకు సాయం చేసే విషయంలో ఒక్కరిద్దరూ తప్పా ఎవరూ ముందుకు రారు.
Telugu Actor : కార్మికుల పక్షపాతి ప్రభాకర్ రెడ్ది..
సీనియర్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరు వినే ఉంటారు. ఈరోజుల్లో పెద్దగా ఆయన్ను గుర్తు పట్టకపోయినా ఎన్టీయార్, ఏఎన్నార్ టైంలోని నటీనటులంతా ఆయన్ను సులువుగా గుర్తుపడతారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్, తండ్రి, బాబాయ్ ఇలా అన్నిపాత్రలకు జీవం పోసిన నటుడు ప్రభాకర్ రెడ్డి. అంతేకాకుండా ఆయనో మంచి రచయిత.. వైద్యుడిగా కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన ఒకవైపు డాక్టర్ వృత్తి కొనసాగిస్తూనే మరోవైపు నాటకాల్లో చేశాడు. అధికంగా తమిళ,హిందీ సినిమాల్లో చేసిన ఈయన 37 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 500కు పైగా సినిమాల్లో నటించాడు. తర్వాత నిర్మాతగా,దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలను కూడా తెరకెక్కించాడు.
ఏకకాలంలో వైద్యవృత్తి నటనను కొనసాగిస్తూ హైదరాబాదులో సినిమా హాల్స్,స్టూడియోలు వంటివి నిర్మాణం చేశారు. కార్మికుల కోసం ఏకంగా తన 10 ఎకరాల పొలాన్ని దానంగా ఇచ్చేశాడు. చిత్రపురి కాలనీలో ఉన్న ఆ భూమికి ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ ఉంది.మణికొండలో ఆయన పేరుమీద ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి అనే పేరు కూడా పెట్టారు.కానీ ఏ రోజు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టుకోలేదు.ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కోట్ల విలువ చేసే భూములను ఉచితంగా కార్మికులకు ఇచ్చేసి తన కూతుళ్ల పెళ్లి సమయంలో నయా పైసా కూడా కట్నం ఇవ్వలేదట.ఈయన మీద ఉన్న అభిమానంతో వీరి అల్లుల్లు కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారని తెలిసింది.