Dimple Hayathi: వ‌ణికిస్తున్న కరోనా.. ర‌వితేజ హీరోయిన్‌కి కూడా పాజిటివ్‌

Authored By Sam C | The Telugu News | Published on: January 17, 2022, 1:00 pm

Dimple Hayathi : ఈ సారి క‌రోనా మ‌హ‌మ్మారి సినీ సెల‌బ్రిటీల‌ను ఎక్కువ‌గా వ‌ణికిస్తుంది. సౌత్, నార్త్ ప్రముఖులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. రోజుల వ్యవధిలో వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కరోనా బారినపడ్డారు. సూపర్ స్టార్ మహేష్ కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి కోలుకున్నారు. అలాగే మంచు మనోజ్, మంచు లక్ష్మి, త్రిష, బండ్ల గణేష్, స‌త్య‌రాజ్, విశ్వ‌క్ సేన్ , మ‌మ్ముట్టి తదితరులు తమకు కరోనా సోకినట్టు వెల్లడించారు. తాజాగా ర‌వితేజ హీరోయిన్‌కి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ చిత్రం లో హీరోయిన్ పాత్ర చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీ. ఈ అమ్మ‌డు స్పెష‌ల్ సాంగ్‌లోను ర‌చ్చ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ‌కి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు వెల్లడించడం జరిగింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనావైరస్ బారిన పడినట్లు డింపుల్ హయాతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పూర్తిగా టీకాలు వేసుకున్న ఈ బ్యూటీ తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది.

Actress Dimple Hayathi covid positive

Actress Dimple Hayathi covid positive

 

Ravi Teja : గుబులు పుట్టిస్తున్న క‌రోనా

తనకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన సందర్భంగా తన అభిమానులను, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని, చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని అభ్యర్థించింది. అంతేకాకుండా గతంలో కంటే బలంగా తిరిగి వస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చింది. మరోవైపు “ఖిలాడీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న విడుదల కావలసిన ఈ సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఓ క‌థానాయిక‌గా డింపుల్ న‌టిస్తుంది

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp