Actress Jayavani : గుర్తింపు కోసమే ఆ పాత్రలు చేశా… నటి జయవాణి ఆసక్తికర వ్యాఖ్యలు
Actress Jayavani : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులువు కాదు.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు ఒక్కోసారి రావు.. ఎంతో మంది చాన్స్ లు ఇస్తామంటూ తిప్పించుకుంటారు. చివరకి హ్యాండ్ ఇస్తారు.. ఇలా కొత్తలో ఎంతో మంది నటీనటులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా సరే యాక్టింగ్ పై ఆసక్తితో పట్టువదలకుండా ప్రయత్నించి చాన్స్ లు కొట్టేస్తారు.. అలా ఇండస్ట్రీకి వచ్చిన వారే నటి జయవాణి.. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.. […]
Actress Jayavani : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులువు కాదు.. టాలెంట్ ఉండి కూడా అవకాశాలు ఒక్కోసారి రావు.. ఎంతో మంది చాన్స్ లు ఇస్తామంటూ తిప్పించుకుంటారు. చివరకి హ్యాండ్ ఇస్తారు.. ఇలా కొత్తలో ఎంతో మంది నటీనటులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినా సరే యాక్టింగ్ పై ఆసక్తితో పట్టువదలకుండా ప్రయత్నించి చాన్స్ లు కొట్టేస్తారు.. అలా ఇండస్ట్రీకి వచ్చిన వారే నటి జయవాణి.. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.. తను ఎదుర్కున్న కష్టాలను చెప్పుకొచ్చింది.
రాజమౌళి-రవితేజల బ్లాక్ బస్టర్ గుర్తుందిగా.. విక్రమార్కుడులో రేయ్ సత్తిగా.. పిల్లల మీదేంట్రా నీ ప్రతాపం.. అనే డైలాగ్ చెప్పింది నటి జయవాణే.. అలాగే యమదొంగ, మర్యాద రామన్నా, గుంటూర్ టాకీస్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నావని చాలా మంది అవమానించారట. ఎంతో మంది నటిగా పనికిరావని ఎగతాలి చేసినట్లు చెప్పుకొచ్చింది. కొంత బాధపడినా ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నారట. అప్పట్లో తన పేరు అందరికీ తెలియాలని అ పాత్రలు చేసిందట. అయితే ఇప్పుడు తనకు ఆ అవసరం లేదంటోంది.
Actress Jayavani: అందరికీ తెలియాలని…
ప్రస్తుతం జయవాణి అంటే అందరికీ తెలుసని… గుర్తింపు కోసమే అలాంటి సినిమాలు చేశానని చెప్పింది. అయితే ఆ క్యారెక్టర్లు చేసినంత మాత్రనా అందరూ అలా ఉండరని.. విలన్ పాత్రలు చేసిన వారు బయట అలానే ఉండరు కదా అంటూ చెప్పుకొచ్చింది. అయితే మూవీ ఛాన్స్ కోసం ఓ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేస్తే ఆఫీస్‌కు వెళ్లానని.. ఓ డ్రెస్‌లో తన ఫొటోలు తీసుకున్నారని చెప్పారు. కొన్ని ఫొటోలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వచ్చేశానని.. మళ్లీ వాళ్లు తనకు ఇప్పటి వరకు కాల్ చేయలేదన్నారు. అయితే కొద్ది రోజులకు ఆ ఫొటోలు ఇంటర్ నెట్‌లో పెట్టారని బాధపడింది. ఆరా తీద్దామని వెళ్తే అక్కడ ఎవరూ లేరన్నారు. ఇలా చాలామందికి ఇండస్ట్రాలో జరుగుతుంటాయి..