Actress : ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్, కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారు..కాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Actress : ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్, కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారు..కాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Actress : ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్, కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారు..కాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్

Actress  : 2019లో విడుదలైన కన్నడ సినిమా ఐ లవ్ యులో రచితా రామ్ కథానాయికగా నటించగా, ఉపేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం 2007లో వచ్చిన ఇంగ్లీష్ చిత్రం ‘ఐ థింక్ ఐ లవ్ మై వైఫ్’కు రీమేక్. ఆ ఇంగ్లీష్ సినిమా కూడా 1972లో వచ్చిన ఓ ఫ్రెంచ్ చిత్ర ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, రచితా నటన మాత్రం అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది.

Actress ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్ కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారుకాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్

Actress : ఆ సీన్ వ‌ల‌న నా పేరెంట్స్, కూతురు న‌న్ను వ‌ద్ద‌న్నారు..కాళ్లు ప‌ట్టుకొని ఏడ్చిన హీరోయిన్

Actress  : ఎమోష‌న‌ల్ కామెంట్స్..

‘ఐ లవ్ యు’ సినిమాలో స్క్రిప్ట్‌లో భాగంగా ఒక బోల్డ్ సన్నివేశంలో రచిత నటించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డారు. తాను చేసిన పాత్రకు ఆమె తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సినిమా విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రచిత ఈ సంఘటనలను వివరించింది.అలాంటి సన్నివేశాల్లో నటించడం వల్ల తల్లిదండ్రులకు కలిగిన బాధను చూసి, రచిత వారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పినట్టు తెలిపింది.

‘‘నాకు తల్లిదండ్రులు ఇప్పటికీ చిన్నపిల్లల్లా చూస్తారు. నేను నటిగా గుర్తించబడినా, వారి కూతురిగా అలాంటి పాత్రలు చేయడం వారి మనసుకు బాగా గుచ్చింది’’ అని చెప్పిన రచిత, ‘‘ఇలాంటి సన్నివేశాల్లో ఇకపై నటించను’’ అని వారికి హామీ ఇచ్చింది. ఆ బాధ నన్నూ వెంటాడుతుంది. నేను నాన్న‌కి హార్ట్ఫుల్‌గా క్షమాపణ చెప్పాను.. నా నిర్ణయాలు ఆయన్ని బాధపెట్టినప్పుడు నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను,’’ అంటూ ఆమె విలపించింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది