Rajamouli : రాజమౌళి లాంటి వాడు ‘ఛాన్స్’ ఇచ్చినా… కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : రాజమౌళి లాంటి వాడు ‘ఛాన్స్’ ఇచ్చినా… కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 October 2022,10:30 am

Rajamouli : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మాటలు కాదు. చాలా కష్టపడాలి. ఎన్ని ఛాన్సులు వచ్చినా వాటిని నిలబెట్టుకోవాలి. హీరోగా రాణించాలన్నా.. హీరోయిన్ గా రాణించాలన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు కాసింత లక్కు కూడా ఉండాలి. స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించినా కూడా కొందరికి పాపులారిటీ రాదు. అలాంటి నటీనటుల్లో ఒకరు రుతిక. తను సిక్స్ టీన్స్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రుతిక. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోనూ నటించింది రుతిక.

విక్రమార్కుడు కంటే ముందు సరదా సరదాగా అనే సినిమాలోనూ నటించింది. గర్ల్ ఫ్రెండ్, బ్లేడ్ బాబ్జి, జాన్ అప్పారావు 40 ప్లస్, ప్రేమాభిషేకం అనే సినిమాల్లోనూ రుతిక నటించింది. అన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ తనకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. తనకు అందం ఉంది. అభినయం ఉంది. గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు ఈ సుందరి. అయినా కూడా తనకు సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదు. అయితే.. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే కాదు..

actress ruthika not settled in telugu cine industry

actress ruthika not settled in telugu cine industry

Rajamouli : గ్లామర్ షో చేసినా ఎందుకు తనకు అవకాశాలు రాలేదు

కాసింత అదృష్టం కూడా ఉండాలి. రుతికకు ఆ అదృష్టం లేదు. చివరకు వరల్డ్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళి చాన్స్ ఇచ్చినా కూడా అమ్మడుకు అదృష్టం మాత్రం పట్టలేదు.. అంటే ఆమెకు ఎంత బ్యాడ్ టైమ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ ఇండస్ట్రీలో కూడా నటించింది రుతిక. ఐటెం సాంగ్స్ చేయడంలోనూ వెనుకాడలేదు. కానీ.. తనకు మాత్రం ఇండస్ట్రీలో చోటు దక్కకుండా పోయింది. పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా తనకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో తను చివరకు సినిమా ఇండస్ట్రీకే దూరం కావాల్సి వచ్చింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి