Rajamouli : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మాటలు కాదు. చాలా కష్టపడాలి. ఎన్ని ఛాన్సులు వచ్చినా వాటిని నిలబెట్టుకోవాలి. హీరోగా రాణించాలన్నా.. హీరోయిన్ గా రాణించాలన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు కాసింత లక్కు కూడా ఉండాలి. స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించినా కూడా కొందరికి పాపులారిటీ రాదు. అలాంటి నటీనటుల్లో ఒకరు రుతిక. తను సిక్స్ టీన్స్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రుతిక. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోనూ నటించింది రుతిక.
విక్రమార్కుడు కంటే ముందు సరదా సరదాగా అనే సినిమాలోనూ నటించింది. గర్ల్ ఫ్రెండ్, బ్లేడ్ బాబ్జి, జాన్ అప్పారావు 40 ప్లస్, ప్రేమాభిషేకం అనే సినిమాల్లోనూ రుతిక నటించింది. అన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ తనకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. తనకు అందం ఉంది. అభినయం ఉంది. గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడలేదు ఈ సుందరి. అయినా కూడా తనకు సినీ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు రాలేదు. అయితే.. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే కాదు..
కాసింత అదృష్టం కూడా ఉండాలి. రుతికకు ఆ అదృష్టం లేదు. చివరకు వరల్డ్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళి చాన్స్ ఇచ్చినా కూడా అమ్మడుకు అదృష్టం మాత్రం పట్టలేదు.. అంటే ఆమెకు ఎంత బ్యాడ్ టైమ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ ఇండస్ట్రీలో కూడా నటించింది రుతిక. ఐటెం సాంగ్స్ చేయడంలోనూ వెనుకాడలేదు. కానీ.. తనకు మాత్రం ఇండస్ట్రీలో చోటు దక్కకుండా పోయింది. పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా తనకు ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో తను చివరకు సినిమా ఇండస్ట్రీకే దూరం కావాల్సి వచ్చింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.