Shobana : ఆ హీరో చేసిన మోసం వ‌ల్ల‌నే స్టార్ హీరోయిన్ ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉండాల్సి వ‌చ్చింద‌ట‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shobana : ఆ హీరో చేసిన మోసం వ‌ల్ల‌నే స్టార్ హీరోయిన్ ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉండాల్సి వ‌చ్చింద‌ట‌..!

Shobana : అందాల న‌టి శోభ‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శోభనకు ప్రస్తుతం 54 ఏండ్లు కాగా.. ఇప్పటి వరకు ఆమె పెండ్లి చేసుకోలేదు. ఒకప్పుడు సౌత్ మూవీల్లో ఆమె ఉంటేనే సినిమా హిట్ అవుతుందనే భావ‌న అందరిలో ఉండేది. వన్నె తరగని అందంతో పాటు నటన, నాట్యం, ఇలా సకలా కళలు ఆమె సొంతం. దాదాపు శోభన ఇప్పటి వరకు 230 సినిమాల్లో నటించిన శోభ‌న‌ హిరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 June 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Shobana : ఆ హీరో చేసిన మోసం వ‌ల్ల‌నే స్టార్ హీరోయిన్ ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉండాల్సి వ‌చ్చింద‌ట‌..!

Shobana : అందాల న‌టి శోభ‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. శోభనకు ప్రస్తుతం 54 ఏండ్లు కాగా.. ఇప్పటి వరకు ఆమె పెండ్లి చేసుకోలేదు. ఒకప్పుడు సౌత్ మూవీల్లో ఆమె ఉంటేనే సినిమా హిట్ అవుతుందనే భావ‌న అందరిలో ఉండేది. వన్నె తరగని అందంతో పాటు నటన, నాట్యం, ఇలా సకలా కళలు ఆమె సొంతం. దాదాపు శోభన ఇప్పటి వరకు 230 సినిమాల్లో నటించిన శోభ‌న‌ హిరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ గా చాలా విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. 1970లో మార్చి 21న కేరళలో తిరువనంతపురం జిల్లాలో జన్మించింది శోభన.

Shobana ప్రేమ‌లో మోసం..

ట్రావెన్​కోర్ సిస్టర్స్​గా పేరొందిన లలిత, పద్మిని, రాగిణిలకు ఈమె మేనకోడలు. వీళ్లు మంచి క్లాసికల్ డ్యాన్సర్లు మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ ఆర్టిస్ట్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభన 1984లో ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్​గా మారింది. 1994లో వచ్చిన ‘మణిచిత్రతాఝు’ అనే సినిమాలో శోభన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాను కన్నడలో ఆప్తమిత్రగా, తమిళంలో చంద్రముఖిగా తర్వాత రీమేక్ చేశారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వం వహించిన మిత్రా-మై ఫ్రెండ్ అనే ఇంగ్షీష్ సినిమాలో నటనకు మరో నేషనల్ అవార్డు వచ్చింది. ఇవే కాకుండా ఆమె కెరీర్​లో ఎన్నో స్టేట్ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఉన్నాయి. రెండోసారి జాతీయ పురస్కారం వచ్చిన దగ్గర నుంచి సినిమాలను జాగ్రతగా ఎంపిక చేసుకోవడం ప్రారంభించింది శోభన.

Shobana ఆ హీరో చేసిన మోసం వ‌ల్ల‌నే స్టార్ హీరోయిన్ ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉండాల్సి వ‌చ్చింద‌ట‌

Shobana : ఆ హీరో చేసిన మోసం వ‌ల్ల‌నే స్టార్ హీరోయిన్ ఇప్ప‌టికీ సింగిల్‌గా ఉండాల్సి వ‌చ్చింద‌ట‌..!

1997 తర్వాత తెలుగు సినిమాల‌కి దూరమైంది శోభ‌న‌. మధ్యలో మోహన్‌ బాబు గేమ్‌ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత దాదాపు 18ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె `కల్కి2898ఏడీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మ్యారేజ్‌ చేసుకోకుండా ఒంటరిగా ఉండటానికి ఓ బలమైన కారణం ఉందట. తాను ఓ హీరోని ప్రేమించిందట. ఎంతో గాఢంగా శోభన ఆ హీరోని ప్రేమించిందని, కానీ అతను హ్యాండిచ్చాడట. అది తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో పెళ్లికే దూరమయ్యిందట. ప్రేమలో మోస పోయిన బాధని తట్టుకోలేకపోయిందట శోభన. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తాను మ్యారేజ్‌ చేసుకోకూడదని అని నిర్ణయించుకుందట. అలా ఐదు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంది. ఇక ఓ అమ్మాయిని ద‌త్త‌త తీసుకొని ఆమె ఆల‌నాపాలనా చూసుకుంటుంది శోభ‌న

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది