Actress : 16 ఏళ్ల వ‌యస్సులో ఆడిష‌న్‌కి వెళితే క‌మిట్‌మెంట్ అడిగారన్న హీరో భార్య‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Actress : 16 ఏళ్ల వ‌యస్సులో ఆడిష‌న్‌కి వెళితే క‌మిట్‌మెంట్ అడిగారన్న హీరో భార్య‌..!

Actress  : ఒక‌ప్పటి హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితికా షేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా కూడా ఆమె రాణించింది. సినిమాలు చేస్తున్న‌ప్పుడే హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం చాలా హాయిగా గడుపుతున్న ఈ జంటకు పెళ్లి అయి 9 సంవత్సరాలు అవుతోంది. ఇప్ప‌టికీ వారు పిల్ల‌ల్ని క‌న‌లేదు. త్వ‌ర‌లోనే ప్లానింగ్ చేస్తాననంటుంది. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో నటించారు వితికా. […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,5:30 pm

Actress  : ఒక‌ప్పటి హీరో వ‌రుణ్ సందేశ్ భార్య వితికా షేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టిగా కూడా ఆమె రాణించింది. సినిమాలు చేస్తున్న‌ప్పుడే హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం చాలా హాయిగా గడుపుతున్న ఈ జంటకు పెళ్లి అయి 9 సంవత్సరాలు అవుతోంది. ఇప్ప‌టికీ వారు పిల్ల‌ల్ని క‌న‌లేదు. త్వ‌ర‌లోనే ప్లానింగ్ చేస్తాననంటుంది. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో నటించారు వితికా. వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకి ఇది రీమేక్. ఈ మూవీలో వితికా షేరు.. త్రిష చెల్లెలిగా చేసిన కలర్స్ స్వాతి పాత్రను పోషించారు.

Actress : కమిట్‌మెంట్‌కి నో..

ఇక 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లింది వితికా. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కన్నడ సినిమా చేసిన తర్వాత తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ ఎంతో తిరిగిన‌ట్టు పేర్కొంది. అప్పుడు ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు. ఇప్పుడంటే ఇన్ స్టాలో ఫోటోలు, రీల్స్ పెడితే ఛాన్సులు వస్తున్నాయి కాని అప్పుడు మాత్రం తెగ తిర‌గాల్సి వ‌చ్చేది. తన పేరు వితికా షేరు కావ‌డంతో నార్త్ అమ్మాయి అనుకునేవారని.. తీరా తెలుగు అమ్మాయి అని తెలిసి చిన్న చూపు చూసేవారని.. చులకనగా మాట్లాడేవారని అన్నారు. 16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఆడిషన్స్ కి వెళితే ఒక ప్రాజెక్ట్ కోసం తనను ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే అమ్మ‌తో మాట్లాడాలి అని న‌న్ను బ‌య‌ట‌కు పంపి సినిమా ఛాన్స్ ద‌క్కాలి అంటే.. నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అమ్మతో అన్న‌ట్టు వితికా షేరు గుర్తు చేసుకున్నారు.

Actress 16 ఏళ్ల వ‌యస్సులో ఆడిష‌న్‌కి వెళితే క‌మిట్‌మెంట్ అడిగారన్న హీరో భార్య‌

Actress : 16 ఏళ్ల వ‌యస్సులో ఆడిష‌న్‌కి వెళితే క‌మిట్‌మెంట్ అడిగారన్న హీరో భార్య‌..!

అమ్మకి అర్థం కాక మా పాపను పిలవండి అని వాళ్లతో అంటే తనను లోపలకు పిలిచారని వితికా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వే మాట్లాడు అని అమ్మ తనతో చెప్పిందని అన్నారు. నాకు పారితోషికం ఇవ్వ‌క‌పోయిన ప‌ర్వాలేదు, క‌మిట్‌మెంట్ మాత్రం కుద‌ర‌ద‌ని చెప్పాను అంటూ వితికా పేర్కొంది. 2018లో నాకు ప్రెగ్నెన్సీ వ‌చ్చింది. కాని అప్పుడు అబార్ష‌న్ అయింది. పిల్ల‌ల్ని ప్లాన్ చేస్తున్నాం. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాము అని పేర్కొంది వితికా.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది