Actress : ఒకప్పటి హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా కూడా ఆమె రాణించింది. సినిమాలు చేస్తున్నప్పుడే హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం చాలా హాయిగా గడుపుతున్న ఈ జంటకు పెళ్లి అయి 9 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ వారు పిల్లల్ని కనలేదు. త్వరలోనే ప్లానింగ్ చేస్తాననంటుంది. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో నటించారు వితికా. వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాకి ఇది రీమేక్. ఈ మూవీలో వితికా షేరు.. త్రిష చెల్లెలిగా చేసిన కలర్స్ స్వాతి పాత్రను పోషించారు.
ఇక 16 ఏళ్ల వయసప్పుడు ఓ తెలుగు సినిమా ఆడిషన్స్ కి వెళ్లింది వితికా. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కన్నడ సినిమా చేసిన తర్వాత తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ ఎంతో తిరిగినట్టు పేర్కొంది. అప్పుడు ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు. ఇప్పుడంటే ఇన్ స్టాలో ఫోటోలు, రీల్స్ పెడితే ఛాన్సులు వస్తున్నాయి కాని అప్పుడు మాత్రం తెగ తిరగాల్సి వచ్చేది. తన పేరు వితికా షేరు కావడంతో నార్త్ అమ్మాయి అనుకునేవారని.. తీరా తెలుగు అమ్మాయి అని తెలిసి చిన్న చూపు చూసేవారని.. చులకనగా మాట్లాడేవారని అన్నారు. 16 ఏళ్ల వయసులో అమ్మతో కలిసి ఆడిషన్స్ కి వెళితే ఒక ప్రాజెక్ట్ కోసం తనను ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే అమ్మతో మాట్లాడాలి అని నన్ను బయటకు పంపి సినిమా ఛాన్స్ దక్కాలి అంటే.. నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అమ్మతో అన్నట్టు వితికా షేరు గుర్తు చేసుకున్నారు.
అమ్మకి అర్థం కాక మా పాపను పిలవండి అని వాళ్లతో అంటే తనను లోపలకు పిలిచారని వితికా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్ళాక.. కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వే మాట్లాడు అని అమ్మ తనతో చెప్పిందని అన్నారు. నాకు పారితోషికం ఇవ్వకపోయిన పర్వాలేదు, కమిట్‌మెంట్ మాత్రం కుదరదని చెప్పాను అంటూ వితికా పేర్కొంది. 2018లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కాని అప్పుడు అబార్షన్ అయింది. పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాం. ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తాము అని పేర్కొంది వితికా.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.