Adhire Abhi shares emotional post
Adhire Abhi : బుల్లితెర ప్రేక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అదిరే అభి. మొదట ఈశ్వర్ సినిమాతో వెండితెరపై పరిచయమైన నటుడు అభి ఆ తర్వాత కొన్నాళ్ళు పలు రియాలిటీ షోలతో కూడా యాంకర్ గా కొనసాగారు. ఇక ఇండస్ట్రీలోకి రాకముందే హైదరాబాద్ ప్రముఖ సాఫ్ట్ వర్క్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్న అభి తనకి ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండాలని జాబ్ వదిలేసి వచ్చాడు. చాలా కాలంగా ఇండస్ట్రీలో నటుడిగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా కూడా కొనసాగిన అభి అనంతరం జబర్దస్త్ లో మొదటి అవకాశంతోనే మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక అతనితో పాటు కొంతమంది కొత్త వారిని కూడా తీసుకువచ్చి వారికి కూడా లైఫ్ ఇచ్చాడు.
మొదట హైపర్ ఆది జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది అభి ద్వారానే. అతను అవకాశం ఇవ్వడంతో మొదట డైలాగ్స్ అందించాడు. జబర్దస్త్ లో సూపర్ హిట్ స్కిట్లతోనూ ప్రేక్షకులను అలరించిన ఆయన .. మరోవైపు సినిమాల్లోనూ హీరోగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. తాజాగా తను ప్రధాన పాత్రల్లో ఓ చిత్రంతో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా తాజాగా యాక్షన్ సీక్వెన్స్ ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఫైటర్ ను ఎదుర్కొనే సమయంలో అదిరే అభి ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో చేతికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా చేతికి పెద్దగాయమే తగిలింది. వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు.
adhire abhi injured in shooting
దాదాపు 15 కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ లోని ఒకరి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందన్నారు. అదిరే అభి జబర్దస్త్ షో నుంచి కూడా తప్పుకున్నాడు. మా టీవీలో నాగబాబు జడ్జిగా ఉన్న కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్‌కు వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు అభి అక్కడ కూడా లేడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంలో హీరో స్నేహితుడి పాత్రలో అభి వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘విష్ణు’ ‘ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు’ ‘విద్యార్థి’ ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ ‘ప్రేమికులు’ ‘మా నాన్న చిరంజీవి’ ‘ఈగ’ ‘రాగల 24 గంటల్లో’ ‘బాహుబలి2’ ‘ రాంగ్ గోపాల్ వర్మ’ వంటి చిత్రాల్లో నటించాడు అభి. బాహుబలి సినిమాకు గాను అదిరే అభి దర్శకత్వ శాఖలో కూడా పనిచేశాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…
karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…
This website uses cookies.