Jabardasth Faima : మల్లెమాలవారు నిజంగా ఫైమాకి ఆ అవకాశం ఇచ్చారా.. ఆమె ఫ్యాన్స్‌ అదిరిపోయే న్యూస్‌

Authored By aruna | The Telugu News | Published on: September 14, 2022, 7:30 pm

Jabardasth Faima : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ కోసం స్టూడెంట్ గా వెళ్లిన ఫైమా అనూహ్యంగా అక్కడి వారి దృష్టిలో పడింది. దాంతో పటాస్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంపిక అయింది. అక్కడి నుండి ఆమె ప్రస్థానం గా కొనసాగుతూ వస్తోంది, పటాస్ కార్యక్రమం ఆపివేసిన కూడా ఆమె యొక్క జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. పటాస్ కార్యక్రమం లో ఆమె సాధించిన విజయాలు ఆమె నవ్వించిన తీరు కారణంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఆమెను తీసుకున్న విషయం తెలిసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆమె తన కామెడీని పండించింది. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ నుండి ఆఫర్ రావడంతో ఫైమా వెళ్లి పోయింది.

సాధారణంగా అయితే ఈటీవీ, మల్లెమాల ని వదిలేసిన వారికి మళ్లీ రీఎంట్రీ ఉండదు. కానీ ఈ అమ్మాయికి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మల్లెమాల వారు ఓకే చెప్పారట. స్టార్ మా మరియు బిగ్ బాస్ నిర్వహకులతో ఉండే ఒప్పందం పూర్తయిన తర్వాత జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మల్లెమాల వారు ఫైమా కి ఓకే చెప్పారని.. అందుకోసమే ఫైమా వెళ్లిపోయింది అంటూ ఈటీవీ కి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎంతో మంది మల్లెమాల మీ వదిలేసి వెళ్లి పోయారు. వారిలో చాలా మంది వెనక్కు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బతిమిలాడారు.. దండం పెట్టారు. అయినా కూడా వారిని కనికరించకుండా మల్లెమాల దూరం పెట్టింది.

after biggboss faima may be re join in jabardasth and sridevi drama company

after biggboss faima may be re join in jabardasth and sridevi drama company

ఒక్కసారి మల్లెమాల గేటు దాటిన వాళ్లు మళ్లీ లోనికి రావాలంటే ఖచ్చితంగా కాళ్లు పైకి తల కిందికి పెట్టాలి అన్నట్లుగా కొందరిలో అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయం మెల్ల మెల్లగా తగ్గేలా మల్లెమాల వారు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ వీడి పోయి ఇతర ఛానల్లో బిజీ అయిన వారికి కూడా ఈటీవీలో ఛాన్స్ ఇస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చమ్మక్ చంద్ర రావడంతో మల్లెమాల వారి లో మార్పు వచ్చింది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ లో మళ్ళీ ఫైమా వస్తే బాగుంటుందని ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంత భావిస్తున్నారు. అలాగే మల్లెమాల వారు కూడా అందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇది నిజమైతే కచ్చితంగా ఫైమా అభిమానులకు గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.

aruna

No bio available for this author.

  1. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  2. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  3. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  4. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  5. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  6. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

  7. "Gold Prices Dhanteras : బంగారం కొనేవారికి ధంతేరస్ గుడ్‌న్యూస్.. ఒక్కరోజులో భారీగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp