Shanmukh – Deepthi Sunaina : బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునయనతో వీడియో కాల్ మాట్లాడిన షణ్ముక్..!!
Shanmukh – Deepthi Sunaina : యూట్యూబర్ షణ్ముక్ అందరికీ సుపరిచితుడే. యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో వెబ్ సిరీస్ లు చేస్తూ రాణిస్తున్నాడు. సోషల్ మీడియాలో మనోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా రాణించటం జరిగింది. సీజన్ ఫైవ్ రన్నర్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు..షణ్ముక్ .. దీప్తి సునయన లవ్ లో ఉండటం జరిగింది.
కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్.. వేరొక లేడీ కంటెస్టెంట్ తో క్లోజ్ గా ఉండడంతో దీప్తి సునయనతో మనస్పర్ధలు వచ్చి లవ్ బ్రేక్ అయ్యింది. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి విపరీతమైన నెగిటివీటి ప్రచారం జరిగింది. అయితే షణ్ముక్… దీప్తి విడిపోవడం చాలామందికి నచ్చలేదు. తర్వాత వీరిద్దరూ కలవాలని ఈ జంటను ప్రేమించే అభిమానులు కోరుకున్నారు. విడిపోయి ఇద్దరూ రెండు సంవత్సరాలు అవ్వగా రీసెంట్ గా షణ్ముక్.. దీప్తి సునయనతో వీడియో కాల్ లో మాట్లాడటం జరిగిందట.
నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మన ప్రేమను ఎలా మర్చిపోయావు..?, చాలా కాలాలు గడిచిన గాని మన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుందని భావించాను. కానీ అనుకోని కారణాలవల్ల మన బంధం ఎలా అయిపోతుందని ఏనాడు అనుకోలేదు. నాకు నేనుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా మంది ఉన్నారు. కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ తొలగిపోలేదు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని షణ్ముక్.. దీప్తి సునయనతో వీడియో కాల్ లో మాట్లాడటం జరిగిందట. కానీ తన కెరియర్ ముఖ్యమని తర్వాత ఆలోచిస్తానని అంతకాలం వెయిట్ చేస్తే చేయి అని దీప్తి సునయన బదిలించినట్లు టాక్.
