After RRR SSrajamouli next project
SS Rajamouli : కెరీర్‌లో ఫ్లాప్ అనేది లేకుండా వరుస విజయాలని తన ఖాతాలు వేసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో భారీ హిట్ కొట్టిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా జనవరి 7న విడుదల కావలసి ఉన్నా , కరోనా వలన వాయిదా పడింది. అయితే రాజమౌళితి సినిమా అంటే హీరోలు సంవత్సరాల తరబడి కాల్షీట్స్ కేటాయించాల్సిందే. ప్రభాస్ 5 సంవత్సరాలు కేటాయిస్తే ప్రభాస్, రామ్ చరణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ సినిమాని అంటిపెట్టుకు కూర్చున్నారు.
ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా స్థాయి మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీ గురించి ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సందర్భంగా రాజమౌళి వెల్లడించారు కూడా.అయితే మహేష్ మూవీ చేసే లోపు మరోవైపు చేయబోతున్నాడని సమాచారం. ఆ సినిమా ఏ హీరోతో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో రణ్‌బీర్ కపూర్ ఫ్రేంలోకి వచ్చింది. రణ్ బీర్ కపూర్ నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` తెలుగు వెర్షన్ కి రాజమౌళి భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని , ఆ క్రమంలోనే మహేష్ ప్రాజెక్ట్ ని పక్కన
After RRR SSrajamouli next project
పెట్టి రాజమౌళి బాలీవుడ్ ఆడియన్స్ కోసం రణ్‌బీర్ కపూర్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారని ప్రచారం నడుస్తుంది. ఇదే జరిగితే మహేష్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఇంకెన్నాళ్లు వేచి చూడాలో మరి. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ భారీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది.
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
This website uses cookies.