Agent Movie Vs Ponniyin Selvan 2 : ఏజెంట్ vs పోన్నియన్ 2 రెండిట్లో ఏ సినిమా కి వెళ్తే బెటర్ ?
Agent Movie Vs Ponniyin Selvan 2 : ఏప్రిల్ 28 న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే కోలీవుడ్ స్టార్స్ విక్రమ్, కార్తీ, జయం రవి నటించిన ‘ పొన్నియన్ సెల్వన్ 2 ‘ సినిమా విడుదల కాబోతుది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. రెండు ఏమాత్రం సంబంధం లేని జోనర్లు విపరీతమైన అంచనాల మధ్య విడుదల కాబోతున్నాయి. అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా కొనసాగాయి. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
ఈ సినిమా 40 కోట్ల వసూళ్లను రాబడితేనే లెక్క సరిపోతుంది. లేదంటే అఖిల్ హీరోగా సక్సెస్ కాలేడు. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న అఖిల్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద విరూపాక్ష సినిమా హవా నడుస్తుంది. ఏజెంట్ సినిమా బాగుంటే వసూళ్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదట ఏజెంట్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ తెలుగు, మలయాళం భాషలలో మాత్రమే విడుదల చేస్తున్నారు.
ఇక తమిళ మల్టీ స్టారర్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 కి దిల్ రాజు వలన చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు దక్కాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ తో కొన్ని నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల చాలా నీరసంగా ఉన్నాయి. ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఏపీ, తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి షోలు పడేలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆన్లైన్ లో టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఈ సినిమా చాలా ముఖ్యం. అంతకుముందు సైరా నరసింహారెడ్డి సినిమాతో అట్టర్ ఫ్లాప్ టాక్ ను అందుకున్నాడు. మరీ ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో కొన్ని గంటలలో తేలిపోతుంది.