Allu Arvind : ఈటీవీ జబర్దస్త్ పొట్ట కొట్ట బోతున్న ఆహా అల్లు అరవింద్
Allu Arvind : ఈటీవీ జబర్దస్త్ కి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి. స్టార్ మా మరియు జీ తెలుగు చానల్స్ వారు కామెడీ షో లు తీసుకు వచ్చి విఫలం అయ్యారు. జబర్దస్త్ స్థాయి కాదు కదా కనీసం ఆ షో దక్కించుకుంటున్న రేటింగ్ లో కనీసం సగం రేటింగ్ కూడా దక్కించుకోలేదు. దాంతో జీ తెలుగు మరియు స్టార్ మా చానల్స్ ఆ షో లను మూసి వేశాయి. ఇక ఈటీవీలో మాత్రమే ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో ప్రసారమవుతుంది. మరే ఛానల్ లో కూడా కామెడీ షో స్ లేవు. ఇలాంటి సమయంలో ఆహా ఓటీటీ ద్వారా ఒక కామెడీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అల్లు అరవింద్ టీం రెడీ అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కామెడీ స్టాక్ ఎక్సేంజ్ అని టైటిల్ తో సుడిగాలి సుదీర్ ని ముందు ఉంచి ఈ కామెడీ షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఆహా టీం రెడీ అయింది.
ముక్కు అవినాష్, యాదమ్మ రాజు, సద్దాం, హరి, ఇంకా పలువురు జబర్దస్త్ మరియు పటాస్ కమెడియన్ ఈ కార్యక్రమంలో కనిపించబోతున్నట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోతో వెళ్లడైంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉంటుందని కామెడీ షో లో సరికొత్తగా ఈ కార్యక్రమం ఉంటుంది అంటూ ప్రేక్షకులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ కార్యక్రమం కనుక సక్సెస్ అయితే తప్పకుండా ముందు ముందు ఆహా జబర్దస్త్ ని మించి కామెడీ కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ కామెడీ కార్యక్రమానికి జడ్జ్ గా నాగబాబు వ్యవహరిస్తాడని సమాచారం అందుతుంది. అతి త్వరలోనే మరో ప్రోమోతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

aha ott going to start a comedy program with sudigali sudheer and patas team
పెద్ద ఎత్తున కమెడియన్స్ ఈ కార్యక్రమంలో ఉంటారు కనుక కామెడీ కి కొదవ ఉండదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహా కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంటున్నానే నమ్మకమును ఓటిటి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డాన్స్ ఐకాన్ కార్యక్రమం స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం పూర్తయ్యే లోపు కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కార్యక్రమం పట్టాలెక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా మొదలవబోతోంది. ఈ వారం నుండే బాలయ్య జోరు మొదలు పెట్టబోతున్నాడు. దీంతో ఆహా ప్రేక్షకులకు మస్త్ ఎంటర్ టైన్మెంట్ పక్కా.