Home » Entertainment » Aishwarya Rai Receive Legal Notice
Entertainment

Aishwarya Rai : ఐశ్వర్య కి డబ్బు పిచ్చా.!? అందుకే ఇలా చేసిందా.!?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 18, 2023, 7:40 pm
Advertisement

Aishwarya Rai : బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి మాజీ మిస్ ఇండియా అయిన ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో కూడా కొన్ని డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే తాజాగా ఐశ్వర్యరాయ్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఐశ్వర్య రాయ్ కి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఐశ్వర్య చాలా కాలం క్రింద సిన్నార్ లో ఒక భూమిని కొనుగోలు చేసింది.

Advertisement

ఆ భూమికి సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. దాదాపుగా ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ కట్టకపోవడంతో ఈ విధంగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఐశ్వర్యరాయ్ తో పాటు మరో 1200మంది కూడా టాక్స్ కట్టకపోవడంతో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో పెద్ద కంపెనీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ టాక్స్ కట్టకపోవడంతో ప్రభుత్వానికి 1.11 కోట్ల నా నష్టం వచ్చిందట.

Aishwarya Rai receive legal notice

Advertisement

దీంతో మార్చ్ లోపు టాక్స్ కట్టాలని ప్రభుత్వం నోటీస్ లు జారీ చేసింది. ఐశ్వరరాయ్ మొత్తంగా రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని తెలుస్తోంది. పది రోజుల్లో కట్టకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం ప్రకారం ఐశ్వర్య పైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇకపోతే ఐశ్వర్య ఇటీవల పోన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి