Akhanda Movie : బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఫస్ట్ డే వసూళ్లు అన్ని కోట్లా? రికార్డులు బద్దలు కొట్టిన బాల‌య్య‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhanda Movie : బాలకృష్ణ ‘అఖండ’ సినిమా ఫస్ట్ డే వసూళ్లు అన్ని కోట్లా? రికార్డులు బద్దలు కొట్టిన బాల‌య్య‌..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :3 December 2021,8:15 am

Akhanda Movie: నందమూరి హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఇవాళే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియగానే.. బాలకృష్ణ ఫ్యాన్స్ కు పూనకాలు వస్తున్నాయి. బెనిఫిట్ షోల వద్ద అయితే రాత్రి నుంచే అభిమానులు క్యూ కట్టారు. ఎన్ని వేలు పెట్టి అయినా సరే.. బాలయ్య బాబు అఖండ సినిమా బెనిఫిట్ షో చూడాలని తెగ ఆరాటపడుతున్నారు.మొత్తానికి సినిమాకు ఇప్పటికే హిట్ టాక్ వచ్చేసింది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే అని.. ఫిలింనగర్ టాక్.

ఈ సినిమా మామూలు గీమూలు సినిమా కాదని.. హైఓల్టేజ్ మాస్ ఎంటర్ టైనర్ అంటూ అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన అఘోరా పాత్రలో అయితే జీవించేశారని అంటున్నారు.ఈ సినిమాకు అఘోరా పాత్రే బలం అని.. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయని కోణాన్ని బాలయ్య బాబు టచ్ చేసి.. పూనకాలు తెప్పిస్తున్నారని అంటున్నారు. అలాగే.. సినిమాలో పుష్కలంగా ఉన్న ఫైట్స్ లో కూడా బాలయ్య అదరగొట్టాడని అంటున్నారు

Akhanda movie First Day collections All Time Record

Akhanda movie First Day collections All Time Record

Akhanda movie: ఒక్క రోజులోనే అన్ని కోట్లు వస్తాయా?

సినిమాలో బాలయ్య బాబు నటనతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదుర్స్ అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లయిమాక్స్ అయితే అదిరిపోయింది అని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్సే సినిమాకు బలం అని చెబుతున్నారు. అవే సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకుపోయాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాకు వస్తున్న హిట్ టాక్ చూస్తుంటే.. ఖచ్చితంగా ఈ సినిమా బాలకృష్ణ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ ను తీసుకొస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు రిలీజ్ రోజున అంటే ఈరోజు కనీసం 11 కోట్లను రాబడుతుందని చెబుతున్నారు. ఇది కేవలం షేర్ మాత్రమే. ఇక గ్రాస్ అయితే 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. యూఎస్ లో అయితే.. కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే బాలయ్య బాబు సినిమాకు 7 కోట్లు వచ్చాయట.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది