Akhil Akkineni : మా అన్న దేవుడు.. ఆయన గురించి తప్పుగా మాట్లాడకండి ప్లీజ్.. వేడుకున్న అఖిల్?
Akhil Akkineni : అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం జోరుమీదున్నాడు. తను నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. సినిమా సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా తన అభిమానులతో అఖిల్ ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ముచ్చటించాడు.

akhil akkineni about his brother naga chaitanya
ఈసందర్భంగా అఖిల్ అభిమానులు తనను సినిమాకు సంబంధించిన పలు విషయాలు అడిగారు. ఆ తర్వాత తన అన్న నాగ చైతన్య గురించి అడిగారు. చైతన్య గురించి చెప్పండి.. అని సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో తన అన్న చైతన్య గురించి ఏం చెప్పాడో తెలుసా?
Akhil Akkineni : మా అన్న అంత మంచి వ్యక్తి ఇంకెవ్వరూ ఉండరు
మా బ్రదర్ గురించి చెప్పడం చాలా ఈజీ. ఆయన చాలా సింపుల్ పర్సన్. ఆయనకు ఏం కావాలో తెలుసు. బ్లాక్ అండ్ వైట్. ఆయన్ను అర్థం చేసుకుంటే.. ఆయనతో చాలా ఈజీగా ఉండొచ్చు. సినిమాలు హిట్ అయినా ప్లాఫ్ అయినా సరే.. ఏమాత్రం టెన్షన్ పడడు. ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. చాలా సింపుల్ గోయింగ్ పర్సన్. ఒక రకంగా చెప్పాలంటే మా అన్న దేవుడు. చాలా సింపుల్ పర్సన్ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.
దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూడండి.
