Dhee 14 Dance Show : ఢీ14 కి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhee 14 Dance Show : ఢీ14 కి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా?

 Authored By prabhas | The Telugu News | Updated on :25 August 2022,8:00 pm

Dhee 14 Dance Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో లో మళ్లీ బిగ్‌ బాస్‌ అఖిల్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్‌ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. గతంలోనే పెద్దగా ఆయన కామెడీకి మార్కులు పడలేదు. కానీ మరెవ్వరు లేకనో లేదా మరేంటో కానీ ఆయన్ను మళ్లీ తీసుకు వచ్చారు. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. కానీ అఖిల్‌ కు మాత్రం ఈజీగా నే రీ ఎంట్రీ లభించింది. ఆయన తక్కువ పారితోషికం తీసుకుంటున్న కారణంగానే మళ్లీ తీసుకున్నారనే టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఢీ షో లో అఖిల్‌ పాల్గొంటున్నందుకు గాను ఒక్క కాల్షీట్ కి లక్షన్నర మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నాడట. సాదారణ కంటెస్టెంట్‌ కు కూడా లక్ష వరకు పారితోషికం ఉంటుంది. అలాంటిది అఖిల్‌ కి లక్షన్నర పారితోషికం అంటే చాలా తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌ గతంలో బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో వారంకు రెండున్నర లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నిజం ఎంతో కానీ ఇప్పుడు మాత్రం రోజుకు లక్షన్నర పారితోషికం తీసుకుంటున్నాడట.

Akhil and Hyper Aadi remuneration for dhee 14 dance show

Akhil and Hyper Aadi remuneration for dhee 14 dance show

అఖిల్‌ తో పాటు ఇతర టీమ్ లీడర్ల కు కూడా చాలా తక్కువ పారితోషికం ఉంటుందట. కానీ హైపర్ ఆదికి మాత్రమే ఒక్క కాల్షీట్ కి ఏకంగా అయిదు లక్షల వరకు పారితోషికం ఉంటుందట. జడ్జ్ ల స్థాయి లో ఆది కి పారితోషికం ఉంటుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది ఏం చేసినా కూడా స్పెషల్‌ గా ఉంటుంది. కనుక ఆయనకు భారీ పారితోషికం ఇవ్వడం లో ఎలాంటి అనుమానం లేదు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా హైపర్ ఆదికి మంచి పేరు కూడా దక్కింది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది