Akira Nandan : పవన్ తనయుడి కోసం ఇంట్రెస్టింగ్ స్టోరి.. త్రివిక్రమ్ తనయుడు డైరెక్షనా?
ప్రధానాంశాలు:
Akira Nandan : పవన్ తనయుడి కోసం ఇంట్రెస్టింగ్ స్టోరి.. త్రివిక్రమ్ తనయుడు డైరెక్షనా?
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan ఇప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండడం వలన సినిమాల సంఖ్య కాస్త తగ్గించారు. త్వరలో మూడు సినిమాలతో పలకరించనున్నా కూడా రానున్న రోజులలో ఆయన సినిమాలు చేయడం కష్టమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు పవన్ తన తనయుడిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. పవన్ వారసుడు అకీరానందన్ అరంగేట్రంపై ఆసక్తి కొనసాగుతోంది.

Akira Nandan : పవన్ తనయుడి కోసం ఇంట్రెస్టింగ్ స్టోరి.. త్రివిక్రమ్ తనయుడు డైరెక్షనా?
Akira Nandan వారసుల హవా..
మరోవైపు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ సినీ ఎంట్రీపై కూడా ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అకీరా మూవీని త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్టర్ చేయబోతున్నాడంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ Trivikram Srinivas దగ్గర కొంత వర్క్ నేర్చుకున్న రిషి మనోజ్..మరో వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర మరింత రాటు దేలబోతున్నాడట. ప్రభాస్ స్పిరిట్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేయబోతున్నాడట రిషి మనోజ్.
త్రివిక్రమే..సందీప్‌రెడ్డి వంగా దగ్గర ట్రైనింగ్ తీసుకొమ్మని రిషి మనోజ్ Rishi Manojకు రికమెండ్ చేశాడంటున్నారు. దాంతో అకిరానందన్..రిషి మనోజ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగా సినిమాలాగా..ఫుల్ వైల్డ్ మూవీగా ఉండబోతుందన్న టాక్ నడుస్తోంది. హీరో, డైరెక్టర్ వారసుల కాంబోలో వచ్చే సినిమాల ఎలా ఉండబోతుందో చూడాలి మరి.