Akira Nandan : ఇండస్ట్రీలోకి అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడు? రేణుదేశాయి ప్లాన్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akira Nandan : ఇండస్ట్రీలోకి అకీరానందన్ ఎంట్రీ ఎప్పుడు? రేణుదేశాయి ప్లాన్..

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయారు. కానీ వీరి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. ఇండస్ట్రీలోని అందరితో పాటు, ఫ్యాన్స్‌కు సైతం వీరు తెలుసు. రేణుదేశాయ్ తన పిల్లలతో పూణేలో స్థిరపడింది. ఇక వారి పిల్లలు పెద్దవారిగా ఎదగడంతో వారి భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో పడింది రేణు. హైదరాబాద్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ ఫ్యామిలీ కొనసాగిస్తూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా వీరు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :6 December 2021,5:00 pm

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయారు. కానీ వీరి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. ఇండస్ట్రీలోని అందరితో పాటు, ఫ్యాన్స్‌కు సైతం వీరు తెలుసు. రేణుదేశాయ్ తన పిల్లలతో పూణేలో స్థిరపడింది. ఇక వారి పిల్లలు పెద్దవారిగా ఎదగడంతో వారి భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో పడింది రేణు. హైదరాబాద్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ ఫ్యామిలీ కొనసాగిస్తూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా వీరు పవన్ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు.తాజాగా రేణుదేశాయ్ బర్త్ డే సందర్భంగా ఆమె కుమారుడు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని తెలిపింది రేణు.

బర్త్ డే గిఫ్ట్‌గా ఓ పాటను ఇవ్వమని రేణు కోరిందట. అందుకు అకీరానందన్ ఓకే చెప్పాడట. అనంతరం తల్లికి ఇష్టమైన పాటను తెలుసుకుని దానికి పియానో వాయించాడట. ఇంతకు ఆ పాట ఏంటంటే బొంబాయి మూవీలోని ఉరికే చిలుక సాంగ్. ఇందుకు సంబంధించిన వీడియోను రేణు తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో పవన్ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందిన అకిరా.. ప్రస్తుతం మాస్టర్ గా వ్యవహరిస్తూ చాలా మందికి కోచింగ్ ఇస్తున్నాడు. దీనికి తోడు పియానో వాయిస్తూ మ్యూజిక్ కంపోజర్ గానూ తన టాలెంట్ చూపించాడు.

Akira Nandan gave an unforgettable gift to renu desai

Akira Nandan gave an unforgettable gift to renu desai

Akira Nandan: తల్లికి మరిచిపోలేని గిఫ్ట్

అకీరా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. అయితే పవన్, రేణుదేశాయ్ చాలా సంవత్సరాల క్రితమే విడిపోయినా.. పిల్లల కోసం పవన్‌ను రేణు కలుస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అకీరా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే అడివిశేష్ మేజర్‌లో అకీరా.. గెస్ట్ రోల్ చేస్తానడి టాక్. కానీ దానికి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది