Samantha : నాగచైతన్య, సమంతల విడాకులకు ఫ్యామిలీలో అంత చర్చ జరిగిందా..?
Samantha : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న నాగచైతన్య, సమంత కొంత కాలం కిందట డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. కాగా, సమంత, నాగచైతన్యలు డైవోర్స్ తీసుకున్న నాటి నుంచి అందుకు గల కారణాలేంటి అని నెటిజన్లు, అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు. వీరు డైవోర్స్ తీసుకోవడం చాలా మందికి నచ్చలేదు. కానీ, అదే నిజంగా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరి విడాకులకు గల కారణాలపై బోలెడన్ని వార్తలొస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి గల కారణం సమంత చేసిన బోల్డ్ రోల్స్.
అని చాలా కాలం నుంచి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై వార్తలు కూడా వస్తున్నాయి. వాటి ప్రకారం.. నాగచైతన్య, ఆయన కుటుంబ సభ్యులు.. సమంత బోల్డ్ రోల్స్ ప్లే చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారట. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత బోల్డ్ సీన్స్‌లో కనిపించడం నాగచైతన్య, ఆయన కుటుంబీకులకు నచ్చలేదని తెలుస్తోంది. ఈ సిరీస్ విషయమై నాగచైతన్య, ఆయన కుటుంబసభ్యులు అందరూ కలిసి ఫ్యామిలీలో మీటింగ్ పెట్టారట.

akkineni family memebers discused about samantha divorce
Samantha : కుటుంబ సభ్యుల అభిప్రాయంతో విభేదించిన సమంత.. !
సదరు మీటింగ్‌లో నాగార్జున, ఆయన భార్య అమల, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సమంతను బోల్డ్ సీన్స్ చేయొద్దని చెప్పే ప్రయత్నం చేశారట. అయితే, సమంత వారందరి అభిప్రాయాలతో విభేదించిందని వినికిడి. తనకు నచ్చి పాత్రలు చేస్తానని కరాఖండిగా చెప్పేసిందని సమాచారం. అలా ఆ మీటింగ్ అయిన తర్వాత సమంత.. సోషల్ మీడియా అకౌంట్స్‌లో తన ఇంటి పేరు ‘అక్కినేని’ని తొలగించిందని టాక్. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వెబ్ సైట్‌లో ప్రచురించారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ, నాగచైతన్య, సమంతలు మాత్రం విడిపోయి ఎవరి దారిలో వారు ప్రొఫెషనల్‌గా ఎదుగుతున్నారు.