
Nagarjuna : టాలీవుడ్ సీనియర్ హీరోల వయస్సు ఆరు పదుల దాటుతోంది.. అయినా కూడా వారు 30 ఏళ్ల పడుచు హీరోల మాదిరిగా యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం, అలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా కామన్ గా జరుగుతుంది. ముసలి హీరోలు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నా కూడా వారు ఇన్నాళ్లు పట్టించుకోకుండా లవ్ స్టోరీస్ సినిమాలు చేసి పరువు తీసుకున్నారు. ఇప్పుడు చాలా మందికి సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గట్లుగా కథలను ఎంపిక చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తాజాగా నాగార్జున తీసుకున్న నిర్ణయం ఆయన అభిమానులతో పాటు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇద్దరు కొడుకులు హీరోలుగా సినిమాలు చేస్తున్న కూడా తాను లవ్ స్టోరీలు చేయడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు విమర్శలు చేసిన నేపథ్యంలో ఇకపై వయసుకు తగ్గట్లుగా సినిమాలు చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఇతర హీరోలతో స్క్రీన్ ని షేర్ చేసుకోవడానికి కూడా నాగార్జున ఓకే చెబుతున్నాడని సమాచారం. ఒకవేళ ఆయనకు తగ్గట్లుగా వయస్సు సంబంధం లేకుండా మంచి పాత్రలు, మంచి కథలు వస్తే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. తానే స్వయంగా మహేష్ బాబుతో ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
akkineni nagarjuna going to do more multi starrer movies coming days
అందుకు మహేష్ బాబు కూడా తప్పకుండా ఒక మంచి మల్టీస్టారర్ సినిమా మనిద్దరం కలిసి చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. కేవలం మహేష్ బాబుతో మాత్రమే కాకుండా యంగ్ హీరోలతో కూడా మల్టీస్టారర్ సినిమాలను చేసేందుకు నాగార్జున సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య యంగ్ హీరో నానితో కలిసి నాగార్జున ఒక మల్టీ స్టార్ సినిమా చేసిన విషయం తెలిసిందే. మళ్లీ యంగ్ హీరోలతో ఈయన మల్టీ స్టార్ సినిమాలు చేస్తే తప్పకుండా అక్కినేని అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ అభిమాని కూడా ఆ సినిమాని ఆదరిస్తారు అనడంలో సందేహం లేదు. నాగార్జున ఇప్పటికైనా మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఆయన నుండి రాబోతున్న సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దసరా కానుకగా ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.