Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్.. అయినా విజయ్ దేవరకొండ కి బాగా పెరిగింది భయ్యా!
Vijay Devarakonda : తెలుగులో ఒక సామెత ఉంటుంది.. ఏనుగు చనిపోయినా వెయ్యి వరహాలే బతికున్నా వెయ్యి వరహాలే అంటారు. అంటే ఒక వస్తువు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దాని విలువ తగ్గదు అనేది ఆ సామెత యొక్క అర్థం. ఇప్పుడు విజయ్ దేవరకొండకు ఆ సామెత అక్షరాల వర్తిస్తుంది అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచిన కూడా విజయ్ దేవరకొండకు మంచి పేరు అయితే సంపాదించి పెట్టింది.
నటుడిగా ఆయన పది మెట్లు పైకి ఎక్కాడు అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తదుపరి సినిమాల యొక్క టాక్ ఆసక్తికరంగా సాగుతోంది. సాధారణంగా అయితే ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరో ఎక్క పారితోషకం చాలా తగ్గుతుంది. కానీ విజయ్ దేవరకొండ పారితోషికం తగ్గకుండా మరింత పెరుగుతుంది అంటూ ఇండస్ట్రీవర్ గలవారు చెబుతున్నారు. ఇటీవల ఆయన తీసుకున్న పారితోష్కానికి ఐదు కోట్లు అదనంగా ఒక ప్రముఖ నిర్మాత ఇచ్చి ఆయనతో సినిమాను చేసేందుకు సంతకం చేయించుకున్నాడని సమాచారం అందుతుంది.
vijay devarakonda hikes his remuneration for his upcoming movies
విజయ్ దేవరకొండ ఇమేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు పైపైకి పెరుగుతూనే ఉంది. ఆయన కాస్త సినిమాల విషయంలో శ్రద్ధ పెడితే తప్పకుండా సూపర్ హిట్ లను దక్కించుకుంటాడు అందుకే ఆయన భారీ ఎత్తున పారితోష్కాన్ని తీసుకుంటున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఖుషి సినిమా విడుదలకు రెడీ అవుతోంది. లైగర్ నిరాశ పర్చింది కనుక ఖుషి సినిమాను ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా రౌడీ స్టార్ భావిస్తున్నాడు. మొత్తానికి రౌడీ స్టార్ జోరు మాత్రం తగ్గలేదు.. పైగా భారీగా పారితోషికం కూడా పెరిగింది.
