Akshara hassan : శృతి హాసన్‌ను డామినేట్ చేస్తున్న చెల్లి… అక్షర హాసన్ మైండ్ బ్లోయింగ్ ఫిక్స్..!
Akshara hassan : శృతి హాసన్.. సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజీ హీరోయిన్. లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆ తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషలతో పాటు ఇతర భాషలలో కూడా శృతి హాసన్ సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. దాదాపు మూడేళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ ఈ ఏడాదే క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ సాలీడ్ హిట్ అందుకుంది. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నటించిన పాత్రకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా సలార్ చేస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సౌత్ అండ్ నార్త్ భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. శృతి హాసన్ కి సలార్ సినిమా అవకాశం ఊహించనిది అని చెప్పాలి. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి సరసన లాభం సినిమా చేస్తోంది. అయితే శృతి హాసన్ కి పోటీగా చెల్లి అక్షర హాసన్ వస్తోందని ఇటీవల టాక్ మొదలైంది. శృతి హాసన్ గ్లామర్ రోల్స్ కి ఏ మాత్రం నో చెప్పదు. హాట్ ఫొటో షూట్స్ కి రెడీ అంటుంది.
Shruti Haasan : శృతి హాసన్ కి అక్షర హాసన్ త్వరలో గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ !
అదే క్రమంలో అక్షర హాసన్ కూడా లేటెస్ట్ ఫొటో షూట్స్ తో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. అయితే సినిమాల పరంగా అక్క రేంజ్ కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకేనేమో ఈ మధ్య తనలోని గ్లామర్ యాంగిల్ బయట పెట్టేందుకు ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే Akshara hassan లేటెస్ట్ హాట్ ఫొటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన వారందరు అక్క శృతి హాసన్ కి అక్షర హాసన్ త్వరలో గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పుకుంటున్నారట. చూడాలి మరి అక్షర హాసన్ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో.
1.
2.
3.