Kamal Haasan : హోటల్ రూమ్ లో హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్
Kamal Haasan : దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఆగ్రహ సంపాదించిన కమల్ హాసన్, తన నటనా ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాడు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా తనదైన ముద్రవేశాడు. అయితే, కమల్ హాసన్ సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా చాలావరకు వార్తల్లో నిలిచింది. ఆయనకు వాణి గణపతి, సారిక ఠాకూర్‌లతో రెండు వివాహాలు, అనంతరం గౌతమితో సహజీవనం చేసిన విషయం తెలిసిందే.
వీరే కాకుండా కమల్ హాసన్.. బాలీవుడ్ నటి రేఖతో ప్రేమాయణం నడుస్తున్నట్లు అప్పట్లో సంచలన వార్తలు వచ్చాయి. ‘మీండుం కోకిల’ (తెలుగులో ‘చిలిపి మొగుడు’) సినిమా షూటింగ్ సమయంలో కమల్ – రేఖ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది ప్రేమగా మారినట్టు అప్పటి మీడియా కథనాలు చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై కమల్ హాసన్‌కి అప్పటి భార్య వాణి గణపతి హోటల్‌లో హఠాత్తుగా తన భర్తను రేఖతో ఒకే గదిలో చూసి తీవ్రంగా స్పందించారన్న వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వివాదం తర్వాత రేఖ ఆ సినిమా నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో నటి దీప చేరారు.

Kamal Haasan : హోటల్ రూమ్ లో హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన కమల్ హాసన్
1978లో వాణి గణపతిని పెళ్లి చేసుకున్న కమల్ హాసన్, 10 ఏళ్ల తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తనతో కలిసి సినిమాల్లో నటించిన సారిక ఠాకూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి శ్రుతి హాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ 2004లో సారికతోనూ విడిపోయిన కమల్ హాసన్, ఆ తర్వాత గౌతమితో సహజీవనం ప్రారంభించారు. ఈ సంబంధం కూడా 2016లో ముగిసింది. కమల్ హాసన్ వ్యక్తిగత జీవితం వివాహాలు, సంబంధాలు, విడాకులతో నిండి ఉన్నప్పటికీ, ఆయన సినీ ప్రస్థానం మాత్రం ఎంతో గౌరవప్రదంగా కొనసాగింది.