Kamal Haasan : ఏంటి.. నువ్వేమైన చరిత్రకారుడివా.. కమల్ హాసన్‌పై హైకోర్ట్ సీరియస్
ప్రధానాంశాలు:
Kamal Haasan : ఏంటి.. నువ్వేమైన చరిత్రకారుడివా.. కమల్ హాసన్‌పై హైకోర్ట్ సీరియస్
Kamal Haasan : కన్నడ భాషను ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలలను కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కమల్ హాసన్ కావచ్చు లేదా మరెవరైనా కావచ్చు.. ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని హెచ్చరించింది. ఆయన వ్యాఖ్యలకు ఆధారాలు ఏంటని ప్రశ్నించిన నాయస్థానం.. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది.

Kamal Haasan : ఏంటి.. నువ్వేమైన చరిత్రకారుడివా.. కమల్ హాసన్‌పై హైకోర్ట్ సీరియస్
Kamal Haasan : క్షమాపణలు చెప్పాలి..
కర్నాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి.రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్‌హాసన్ తీరుతో శివరాజ్‌కుమార్ కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
మీరు కమల్ హాసన్ కావొచ్చు లేదా ఇంకా పెద్ద నటుడైనా కావచ్చు. అయితే.. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మాత్రం మీకు లేదు. ఓ ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. మీరు ఏ ప్రాతిపాదికపన ఆ వ్యాఖ్యలు చేశారు? మీరు ఏమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమీ అడిగారు. క్షమాపణలు మాత్రమే కదా. ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది.’ అని న్యాయస్థానం తెలిపింది.