Hero – Heroine : తాతగారి వయసు ఉన్న హీరో తో టీనేజ్ హీరోయిన్ కి కడుపు – ఓరి నాయనో ప్రపంచం ఇలా అయిపోయింది ఏంట్రా !

Advertisement

Hero – Heroine : ప్రస్తుతం ప్రపంచం ఎటు పోతుందో కూడా అర్థం కావడం లేదు. తాజా సంఘటన చూస్తే అలానే అనిపిస్తుంది. ఒకప్పటి హాలీవుడ్ అందగాడు అల్ పాసినో కూతురు వయసు ఉన్న అమ్మాయితో బిడ్డని కనబడుతున్నాడు. 80, 90 కాలంలో ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. ఆయన హెయిర్ స్టైల్, గుబురు గడ్డం స్టైల్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఇక తెలుగులో గాడ్ ఫాదర్, లెజెండ్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. 83 ఏళ్ల వయసులో ఇప్పటికీ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇతగాడికి పెళ్లిళ్లు, బ్రేకప్ లు కూడా అంతే ఆసక్తికరం.

Advertisement

తాజాగా పాసినో 83 ఏళ్ల వయసులో కూడా తండ్రి కాబోతున్నాడు. త్వరలో అతడు నాలుగవ బిడ్డకు వెల్కమ్ చెప్పబోతున్నాడు. అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా రెండు సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. అప్పట్లో ఈ రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు జంటగా సన్నిహితంగా ఉన్న ఫోటోలు రావడం అందరికి అలవాటైంది. ఇద్దరినీ కరోనా వైరస్ దగ్గర చేయడంతో ఆ బంధం విడదీయరానిదిగా మారింది. ఇప్పుడు నూర్ ఎనిమిది నెలల గర్భిణీ. మరో నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఆమెకు ఇదే మొదటి సంతానం. దీంతో ప్రపంచ మీడియా అంతా షాక్ అయిపోతున్నారు.

Advertisement
Al Pacino Expecting First Child With GF Noor Alfallah
Al Pacino Expecting First Child With GF Noor Alfallah

80 ఏళ్ల వయసులో తండ్రి అవుతున్నాడు అంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతగాడికి అంతకుముందు 1989 లో జోలీ పాసిని తో పెళ్లి అయింది. వారిద్దరికీ ఒక బిడ్డ జన్మించింది. ఆ తర్వాత అంజిలియోతో రెండవ వివాహం అయింది. వారికి కూడా ఇద్దరు కవల పిల్లలు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నూర్ అల్ఫాల్లతో నాలుగవ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. ఆమెకు కూడా ఇలాంటి డేటింగ్ కొత్తేం కాదు. తనకన్నా వయసులో వ్యత్యాసం ఉన్న వారితో రిలేషన్ షిప్ లో ఉంటుంది. ఆమె అంతకుముందే ఇద్దరితో డేటింగ్ చేసింది. ఇప్పుడు తండ్రి కంటే పెద్దవాడు అయినా పాసినో తో పెళ్లి చేసుకున్నాడు.

Advertisement
Advertisement