Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •   Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం ఎప్ప‌టి నుండో న‌డుస్తుంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇది ప్యాన్ వరల్డ్ మూవీగా చెబుతున్నారు. ఈ టైమ్ లో ప్రశాంత్ నీల్ తో మూవీ అనేది మాగ్జిమం రూమర్ అనుకున్నారు చాలామంది. బట్.. ఇది రూమర్ కాదు.

Allu Ajun అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా

Allu Ajun : అల్లు అర్జున్‌తో ప్ర‌శాంత్ నీల్ రావ‌ణం.. దిల్ రాజు గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా..!

Allu Ajun  : బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..

అట్లీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ ప్రశాంత్ నీల్ తోనే. అది కూడా దిల్ రాజు బ్యానర్ లో. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పడం విశేషం. ఈ చిత్రానికి ‘రావణం’అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. టైటిల్ చూస్తే ఈ సారి కూడా ప్రశాంత్ నీల్ హీరో నెగెటివ్ అప్రోచ్ తోనే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాడు అనుకోవచ్చు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోందీ చిత్రానికి. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.

ఈ సినిమాను వచ్చే యేడాది జూన్ 25న విడుదల చేస్తాం అని అఫీషియల్ గానే ప్రకటించారు. అటు అల్లు, అట్లీ మూవీకి కూడా అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. సో.. ఆ లోగా ప్రశాంత్ నీల్ ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. మొత్తంగా ఎన్టీఆర్ – నీల్ తర్వాత అల్లు అర్జున్ – నీల్ కాంబో ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్టే అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది