Allu Aravind : అల్లు అర్జున్ – రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్.. టైటిల్ లీక్ చేసిన అల్లు అర‌వింద్

Advertisement
Advertisement

Allu Aravind : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ హంగామా న‌డుస్తుంది. ఇద్ద‌రు హీరోలు ప్ర‌ధాన పాత్ర‌లో ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంది. ఆ క్ర‌మంలోనే అనేక మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల రామ్ చ‌రణ్- ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం తెర‌కెక్క‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక త్వ‌ర‌లో రామ్ చ‌ర‌ణ్‌.. అల్లు అర్జున్‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ లీక్ చేశారు. బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అర‌వింద్ ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్బంగా కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న అలీతో సరదాగా షోకు అతిథిగా వ‌చ్చేశారు.

Advertisement

ఈ షోలో ,చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు అర‌వింద్. పుష్ప సినిమా బన్నీకి తనకు.. ఇద్దరికీ మైల్ స్టోన్ లాంటిందని.. ఈ మూవీతో బన్నీ నేషనల్ స్టార్ కావడం చాలా తృప్తిగా ఉందని తెలిపారు.అలాగే తమ బ్యానర్‏లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవి గారే అని. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే అని అన్నారు. మ‌గ‌ధీర సినిమా త‌న‌కి మంచి సంతృప్తిని ఇచ్చింద‌ని కూడా పేర్కొన్నారు. ఇక ఇటీవలే ఈయన కన్నడ బ్లాక్‌బస్టర్‌ ‘కాంతారా’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయ‌గా, ఈ సినిమా మొదటి రోజు బ్రేక్‌ ఈవెన్ పూర్తి చేసుకొని అల్లు అరవింద్‌కు లాభాల పంట పండిస్తుంది.

Advertisement

Allu Aravind multi starrer with Allu Arjun And Ram Charan

Allu Aravind : వెయిటింగ్..

ఇక అల్లు అరవింద్ .. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల తో కలిసి మల్టీస్టారర్‌ చేయాలనుందని వెల్లడించాడు. ఇందుకోసం దాదాపు 10 ఏళ్ల క్రితమే ‘చరణ్‌-అర్జున్‌’ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేసినట్లు తెలిపాడు. ప్రతీ ఏడాది ఆ టైటిల్‌ను రిన్యూవల్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో చరణ్, బన్నీ కలిసి ఎవడు అనే సినిమా చేశారు. అయితే అందులో బన్నీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్ద‌రు ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపిస్తే ఆ సంద‌డే వేరు. ప్రస్తుతం చరణ్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్‏గా దూసుకుపోతున్నారు. ఓవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చేస్తుండగా.. చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Ys Jagan : జగన్ ను ప్రజలనుండి దూరం చేసింది ఆయ‌నేనా..?

Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…

29 minutes ago

Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్

Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…

1 hour ago

Tomato Juice To Regrow Hair : మీ జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, చుండ్రు సమస్యలు పోవాలంటే టమాటాలతో ఇలా చేయండి… ఒక మీరాకిలే…?

Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…

2 hours ago

Magic Leaf : కేవలం 5 రూపాయలకే ఈ ఆకు, పురుషులకు ఆ విషయంలో ఎనర్జీ బూస్టర్… ఇక తగ్గేదేలే…?

Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…

3 hours ago

Glowing Skin : ముల్తాన్ మట్టితో ఇలా చేస్తే మీ అందం రెట్టింపే…. అసలు సోపే అవసరం లేదు…?

Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…

4 hours ago

Papaya Leaf : ఈ ఆకుని నీటిలో మరిగించి తాగారంటే… జన్మలో కూడాడాక్టర్ వద్దకు వెళ్ళనే వెళ్ళరు…?

Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…

5 hours ago

Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం… శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే…?

Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…

6 hours ago

Hindu Deities : ఎలాంటి గ్రహదోషాలు తొలగాలన్నా… ఈ ఏడుగురు మూర్తులతోనే సాధ్యం… వీరి అనుగ్రహం కోసం ఇలా చేయండి…!

Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…

7 hours ago