Allu Aravind : అల్లు అర్జున్ – రామ్ చరణ్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్.. టైటిల్ లీక్ చేసిన అల్లు అరవింద్
Allu Aravind : ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ హంగామా నడుస్తుంది. ఇద్దరు హీరోలు ప్రధాన పాత్రలో ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆ క్రమంలోనే అనేక మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటీవల రామ్ చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే చిత్రం తెరకెక్కగా, ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక త్వరలో రామ్ చరణ్.. అల్లు అర్జున్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ లీక్ చేశారు. బడా ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్ ఇటీవల అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్బంగా కమెడియన్ అలీ నిర్వహిస్తోన్న అలీతో సరదాగా షోకు అతిథిగా వచ్చేశారు.
ఈ షోలో ,చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అరవింద్. పుష్ప సినిమా బన్నీకి తనకు.. ఇద్దరికీ మైల్ స్టోన్ లాంటిందని.. ఈ మూవీతో బన్నీ నేషనల్ స్టార్ కావడం చాలా తృప్తిగా ఉందని తెలిపారు.అలాగే తమ బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేసింది కచ్చితంగా చిరంజీవి గారే అని. తీసిన అన్ని సినిమాలు దాదాపు హిట్లే అని అన్నారు. మగధీర సినిమా తనకి మంచి సంతృప్తిని ఇచ్చిందని కూడా పేర్కొన్నారు. ఇక ఇటీవలే ఈయన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయగా, ఈ సినిమా మొదటి రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని అల్లు అరవింద్‌కు లాభాల పంట పండిస్తుంది.

Allu Aravind multi starrer with Allu Arjun And Ram Charan
Allu Aravind : వెయిటింగ్..
ఇక అల్లు అరవింద్ .. రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల తో కలిసి మల్టీస్టారర్ చేయాలనుందని వెల్లడించాడు. ఇందుకోసం దాదాపు 10 ఏళ్ల క్రితమే ‘చరణ్-అర్జున్’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు తెలిపాడు. ప్రతీ ఏడాది ఆ టైటిల్‌ను రిన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించాడు. గతంలో చరణ్, బన్నీ కలిసి ఎవడు అనే సినిమా చేశారు. అయితే అందులో బన్నీ కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపిస్తే ఆ సందడే వేరు. ప్రస్తుతం చరణ్, బన్నీ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఓవైపు అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చేస్తుండగా.. చరణ్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
