ఆహా యాప్‌తో అల్లు అరవింద్.. తెలుగు ఓటీటీ ప్రపంచానికి పితామహుడు అయ్యారు అంటూ అల్లు అర్జున్ పెద్ద పెద్ద పదాలను వాడేశాడు. ఇలా అల్లు బ్రాండ్‌ను ఇండస్ట్రీలో బలంగా వేయాలని బన్నీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టున్నాడు. అందుకే అదును చూసి సరైన సమయం రాగానే అల్లు బ్రాండ్‌ను పైకి ఎత్తాడు. ఇన్నాళ్లు ఎక్కడా కూడా అల్లు బ్రాండ్ గురించి మాట్లాడని బన్నీ అల వైకుంఠపురములో సక్సెస్ తరువాత పైకి లేపాడు.
అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అని వేసుకోవడం అది కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ ఖాతాలోనే వేసుకోవడం తనంతా మొనగాడు లేడన్నట్టు స్టేజ్ మీదే తాత, నాన్న అంటూ అల్లు బ్రాండ్ గురించి మాట్లాడాడు. ఇన్నాళ్లు మెగా జపం చేసిన బన్నీ ప్రస్తుతం పూర్తిగా అల్లు జపమే చేస్తున్నాడు. ఇక ఈ మధ్య ఆహా యాప్ ద్వారా అల్లు బ్రాండ్‌ను లేపే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆహా యాప్‌లో బన్నీ ఎపిసోడ్ ప్రసారమైంది. ఇందులో కూడా పూర్తిగా అల్లు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆ ఎపిసోడ్ చేసినట్టుంది.
అల్లు అర్జున్, స్టైలీష్ స్టార్, అల వైకుంఠపురములో రికార్డులు, బుట్టబొమ్మ, అల్లు స్టూడియో, మోస్ట్ సర్చ్డ్ టాలీవుడ్ యాక్టర్ అంటూ ఇలా తన రికార్డుల గురించే ప్రస్తావించేలా ఆహా టీం స్క్రిప్ట్ రాసుకుంది. మొత్తంగా అల్లు భజన కోసం బన్నీ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్టుగా కనిపించారు. వారిది వారే డప్పు కొట్టుకుంటూ అల్లు వారి బ్రాండ్‌ను ఇండస్ట్రీలో గుర్తించేలా చేసుకుంటున్నారు. మొత్తంగా బన్నీ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకున్నాడని తెలుస్తోంది. అల్లు హీరోగానే తనను పిలవాలని మున్ముందు హుకుం జారీ చేస్తాడేమో ఇక.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.