బద్రీనాథ్ సమయంలో అంత పెద్ద గాయమా?.. అమ్మో బన్నీ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

బద్రీనాథ్ సమయంలో అంత పెద్ద గాయమా?.. అమ్మో బన్నీ కష్టాలు అన్నీ ఇన్నీ కాదు!!

హీరోలకు స్టార్ స్టేటస్ అంత ఈజీగా రాదు.. వచ్చిన ఆ స్టార్డంను కాపాడుకోవడమూ అంత ఈజీ కాదు. అలా స్టార్ హీరోలు కొనసాగేందుకు ఎన్నో కష్టాలు భరిస్తారు. ఒళ్లు హూనం చేసుకుంటారు హీరోలు. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ కాళ్లు చేతులు మోకాళ్లు భుజాలకు గాయాలు చేసుకుంటారు. ప్రతీ సినిమాలో హీరోలకు ఏదో ఒక గాయం అవ్వడం పరిపాటే. ప్రస్తుతం అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు నిత్యం గాయాలు అవుతూనే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌కు గతంలో పెద్ద […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :3 January 2021,1:28 pm

హీరోలకు స్టార్ స్టేటస్ అంత ఈజీగా రాదు.. వచ్చిన ఆ స్టార్డంను కాపాడుకోవడమూ అంత ఈజీ కాదు. అలా స్టార్ హీరోలు కొనసాగేందుకు ఎన్నో కష్టాలు భరిస్తారు. ఒళ్లు హూనం చేసుకుంటారు హీరోలు. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ కాళ్లు చేతులు మోకాళ్లు భుజాలకు గాయాలు చేసుకుంటారు. ప్రతీ సినిమాలో హీరోలకు ఏదో ఒక గాయం అవ్వడం పరిపాటే. ప్రస్తుతం అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు నిత్యం గాయాలు అవుతూనే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్‌కు గతంలో పెద్ద గాయమే అయిందట. తాజాగా ఈ విషయాన్ని సామ్ జామ్ షోలో బయట పెట్టేశాడు.

allu arjun about badrinath shoulder injury in sam jam

allu arjun about badrinath shoulder injury in sam jam

బద్రినాథ్ సమయంలో బన్నీకి భుజానికి ఓ గాయమైందట. ఆ సమయంలో ఆపరేషన్ లేకుండానే ఏదో చిన్నగా చికిత్స చేశారట. కానీ కొన్నాళ్లకు మాత్రం అది ఇంకా బాధించడం మొదలుపెట్టింది. అయితే ఈ సారి ఆస్ట్రేలియాలో చికిత్స నిమిత్తం వెళ్లారట. ఈ సారి కూడా ఆపరేషన్ లేకుండా ఏదైనా చికిత్స చేస్తారని బన్నీ అనుకున్నాడట. కానీ ఈ సారి మాత్రం పెద్ద షాక్ ఇచ్చారట. భుజాన్ని కోసేయాలని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.

అయితే ఆ సమయంలో జులాయి సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడట. ఆపరేషన్ అయితే ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్‌ను అడిగితే.. సింపుల్‌గా ఆరేడు నెలలు అని చెప్పేశాడట. కానీ అప్పుడే జులాయి పనులు జరుగుతున్నాయని తరువాత చేసుకోవచ్చా? అని డాక్టర్‌ను అడిగితే కుదరదని చెప్పాడట. అలా భుజానికి ఆపరేషన్ అవ్వడంతో డ్యాన్సులు సరిగా చేయలేకపోయానని నాటి సంగతులు బన్నీ బయట పెట్టేశాడు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది