Allu Arjun : మ‌ళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అస‌లు బ‌న్నీకి ప‌వ‌న్ ఎలా బాబాయ్ అవుతాడు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : మ‌ళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అస‌లు బ‌న్నీకి ప‌వ‌న్ ఎలా బాబాయ్ అవుతాడు.!

 Authored By ramu | The Telugu News | Updated on :8 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : మ‌ళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అస‌లు బ‌న్నీకి ప‌వ‌న్ ఎలా బాబాయ్ అవుతాడు.!

Allu Arjun : మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య గొడ‌వ ఎంత అగ్గి రాజేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.వారెలా ఉన్నారో తెలియ‌దు కాని అభిమానులు కొట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే మెగా బ్రాండ్ వదిలి సొంతంగా అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ.. మెగాభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి‌కి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన కామెంట్స్.. అల్లు అర్జున్‌ని పూర్తిగా మెగా బ్రాండ్‌కి దూరం చేశాయి. ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా.. ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంపై అనేకానేక మాటలను బన్నీ ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆ మధ్య ఓ మూవీ ఫంక్షన్‌లో మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగగా.. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌కి క్లాస్ ఇచ్చాడు.

Allu Arjun మ‌ళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్ అస‌లు బ‌న్నీకి ప‌వ‌న్ ఎలా బాబాయ్ అవుతాడు

Allu Arjun : మ‌ళ్లీ మంట రాజేసిన అల్లు అర్జున్.. అస‌లు బ‌న్నీకి ప‌వ‌న్ ఎలా బాబాయ్ అవుతాడు.!

Allu Arjun అంత త‌ల పొగ‌రా..!

అప్పటి నుండి అల్లు అర్జున్‌లో ఛేంజ్ కనిపిస్తూ వస్తుంది. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, మెగా బ్రాండ్‌ని.. మెగాభిమానులని బాధపెడితేనే తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పడుతుందని భావించినట్లుగా ఉన్నాడు. తను అంత చేసినా సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం చూసి కరిగిపోయాడో తెలియదు కానీ.. ఫైనల్లీ అల్లు అర్జున్‌ మారిపోయారు. ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్‌లో కళ్యాణ్ బాబాయ్ అంటూ.. మరోసారి పాత అల్లు అర్జున్‌ని గుర్తు చేశారు. ‘‘టిక్కెట్ల ధరలను పెంచుకునేలా జీవో రావడానికి ప్రధానకారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ. నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్యూ. హార్ట్‌ని టచ్ చేశారు..’’ అని అల్లు అర్జున్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ అక్కడితో ఆగకుండా “ఆన్ ఏ పర్సనల్ నోట్” అంటూ “పవన్ కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ వెరీ మచ్” అంటూ మరోసారి పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్. దీంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కి బాబాయ్ ఎప్పుడు అయ్యారు..? ఆయన వరుసకు మామయ్య కదా అవుతారు? అని సినీ జనులంతా సందేహం వ్యక్తం చేస్తున్నారు. నష్ట నివారణ కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాడని ,అంతేతప్ప తన మేనమామలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్లు చేయలేదని స్పష్టంగా తేటతెల్లమైందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బన్నీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కళ్యాణ్ బాబాయి అని ప్రస్తావించడంతో బంధాలను కూడా మరిచిపోయాడా అంటూ ఫైర్ అవుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది