Allu Arha : తండ్రి బన్నీని మించిన తనయ.. ప్రపంచ రికార్డు సృష్టించిన అల్లు అర్హ..
Allu Arha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun తనయ అల్లు అర్హ Allu Arha పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’తో బాలనటిగా సినీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో భరతుడి పాత్రను అల్లు అర్హ అత్యద్భుతంగా పోషించిందని ఆ చిత్ర మేకర్స్ చెప్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే ఓ విషయంలో అర్హ తండ్రి బన్నీని మించిపోయింది. నాలుగున్నరేళ్ల వయసులోనే అర్హ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటింది. ఇంతకీ ఆమె ఏ విషయంలో రికార్డు సృష్టించిందంటే..చెస్ ఆటలో నాలుగున్నరేళ్ల వయసులోనే అల్లు అర్హ నిష్ణాతురాలైంది. ఈ గేమ్‌లో వరల్డ్ రికార్డు సృష్టించి ప్రఖ్యాత్ నోబుల్ అవార్డును గెలుచుకుంది అల్లు అర్హ. ఈమె అంత చిన్న ఏజ్‌లో చెస్ ఆడటమే కాదు.
Allu Arha : తన ప్రతిభను ఇతరులకు పంచి అవార్డు గెలుచుకునన అర్హ..
ఇతరులకు చెస్ గురించి ట్రైనింగ్ కూడా ఇస్తుంది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీకి చెందిన రాయ్ చెస్ అకాడమీలో అల్లు అర్హ చెస్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్స్, ఇంట్లో బంధువులు, ఇతరులకు ట్రైనింగ్ ఇచ్చిన అర్హ.. Allu Arha రెండు నెలల్లోనే 50 మందికిపైగా చెస్ ఆటలో మెళకువలు నేర్పిందట. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి, ఆర్బిటల్ చొక్కలింగం బాలాజీ…అల్లు అర్హకు టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్టులో ‘అర్హ’ అర్హతను సాధించడమే కాదు.. ప్రతిభా పాటవాలను చూపించింది. దాంతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు అందించింది. బన్నీ, అల్లు స్నేహల సమక్షంలో అర్హ ఆ అవార్డు అందుకుంది.
ఇకపోతే తమ కూతురు ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించి అవార్డు అందుకోవడం పట్ల తల్లిదండ్రులు అల్లు అర్జున్ Allu Arjun, స్నేహ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు అర్హ Allu Arha ను తండ్రిని మించిన తనయ అని పొగిడేస్తున్నారు. భవిష్యత్తులో తండ్రి పేరును నిలపడమే కాదు..తండ్రి కంటే గొప్ప స్థాయికి అర్హ వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.