Allu Arjun : స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కరోనా భయం తొలగిపోని రోజుల్లో కూడా సౌత్, నార్త్ రాష్ట్రాల్లో కూడా పుష్ప సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. గతంలో ఆయనకు తెలుగుతో పాటు కేరళలో క్రేజ్ ఉండేది. కేరళలో అల్లు అర్జున్ కి స్టార్ రేంజ్ పాపులారిటీ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు మలయాళంలో కూడా విడుదల చేస్తారు. పుష్ప సినిమాతో రేంజ్ పీక్స్‌కి వెళ్లింది.
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి భాగం డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ వంటి వారు నెగిటివ్ పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సత్తా చాటింది. ఇప్పుడు పుష్ప 2 కోసం సిద్ధమవుతుండగా, ఆ గ్యాప్‌లో ఫ్యామిలీతో ట్రిప్ వేశాడు.
కొద్దిరోజుల క్రితం ఆఫ్రికా టూర్ వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడ సరదాగా గడుపుతున్నారు. అల్లు అర్జున్, కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో టాంజానియాలోని నేషనల్ పార్క్ లో దిగిన ఒక క్యూట్ పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు అల్లు స్నేహా రెడ్డి. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెలాఖరులో వారు హాలిడే నుండి ఇండియాకి తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగులో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న పుష్ప హిందీలో మాత్రం భారీ విజయం నమోదు చేసింది. వంద కోట్లకు పైగా వసూళ్లతో క్లీన్ హిట్ గా నిలిచింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.