Home » Entertainment » Adhire Abhi Comments On Anasuya
Entertainment

Anasuya : అన‌సూయ‌కి ఇది బిక్ష కాదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన అదిరే అభి

Authored By
Sam C
The Telugu News | Updated on: July 5, 2022 12:37 pm
Advertisement

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను అద‌ర‌గొడుతుంది. ఈ ముద్దుగుమ్మ జ‌బ‌ర్ద‌స్త్ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మ‌ధ్య కాలంలో సినిమాల్లో కూడా న‌టిస్తూ బిజీగా మారిపోయింది. క్ష‌ణం, రంగ‌స్థలం, పుష్ప ది రైజ్ వంటి సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తూ వెండితెర ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రవుతుంది. లేటెస్ట్‌గా విడుద‌లైన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలోనూ అన‌సూయ న‌టించింది. అన‌సూయ ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ క్రిష్ స్క్రిప్ట్ అందిస్తున్న క‌న్యాశుల్కం వెబ్‌సిరీస్‌లో న‌టిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో అన‌సూయ వేశ్య‌గా న‌టించ‌నుంద‌ట‌. గుర‌జాడ అప్పారావు రచించిన క‌న్యాశుల్కం నాటకం ఆధారంగా క్రిష్ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌.

Advertisement

ఇందులో మ‌ధుర‌వాణి అనే వేశ్య పాత్ర‌లో అన‌సూయ న‌టించ‌నుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు ఈమె చేసిన పాత్ర‌ల కంటే ఈ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండ‌నుంద‌ట‌. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. అనసూయ టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. పుష్ప చిత్రంలో సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Adhire Abhi comments on Anasuya

Advertisement

Anasuya : అభి స్ట‌న్నింగ్ కామెంట్స్..

అన‌సూయ ప్ర‌స్తుతం వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తుంది. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో అనసూయపై కమెడియన్ అదిరే అభి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనసూయ కూడా అభి కామెంట్స్ కి ఫిదా అయింది. ఆ వీడియోను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అభి మాట్లాడుతూ అనసూయని ముద్దుగా అను అని ప్రస్తావించాడు. ‘అను నేను నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడర్ గా చేశావు, యాంకర్ గా చేశావు. ఇప్పుడు నటిగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో నటిస్తున్నావు. నీ ఎదుగుదల ఎవరో పెట్టిన బిక్ష కాదు. నువ్వు కష్టపడి సాధించుకున్నది అని అభి ప్రశంసలు కురిపించాడు. ప్ర‌స్తుతం అభి వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారుతున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి