Allu Arjun : బ‌న్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్ప‌బోతున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : బ‌న్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్ప‌బోతున్నాడా..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : బ‌న్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్ప‌బోతున్నాడా..!

Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మార‌డం మ‌నం చూశాం. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన చర్చ జరిగింది. హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ పైన మంత్రులు స్పందించారు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారి స్టైల్‌లో త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. అయితే రేవంత్‌ రెడ్డి సర్కార్‌ పై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ సీరియస్‌ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ పై ఆయన మామ, కాంగ్రెస్‌ పార్టీ నేత చంద్రశేఖర్ స్పందిస్తూ… పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించినప్పుడు ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులు అందర్నీ అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహించారు.

Allu Arjun బ‌న్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్ప‌బోతున్నాడా

Allu Arjun : బ‌న్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్ప‌బోతున్నాడా..!

Allu Arjun మ‌న‌స్థాపం..

ఎక్కువ మంది గుమీగూడిన చోట ఇలాంటి ఘటనలు జరుగుతే ఎవరిని బాధ్యుల్ని చేస్తారు?? అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టు ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇక అటు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు కేఏ పాల్. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అంటూ కేఏ పాల్ ఆగ్రహించారు.అయితే అల్లు అర్జున్ మామ ఇప్పుడు కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్ప‌నున్నార‌నే వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది.

గ‌తంలో బీఆర్ఎస్‌లో పని చేసిన శేఖ‌ర్ రెడ్డి నాగార్జున సాగ‌ర్ నుండి టిక్కెట్ ఆశించారు. కాని సీటు ద‌క్క‌లేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆయన పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన తరువాత పార్టీకి రాజీనామా పైన తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా మంత్రి సీతక్క సైతం చిరంజీవితో పాటుగా శేఖర్ రెడ్డి తమ పార్టీలోనే ఉన్నారని…అల్లు అర్జున్ పైన ఎలాంటి కక్ష్య లేదని స్పష్టం చేసారు. పొన్నం ప్ర‌భాక‌ర్ కూడా అల్లు అర్జున్‌పై త‌మ‌కి ఎలాంటి కోపం లేద‌ని అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది