allu arjun gets 100 marks
Allu arjun :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. బన్నీ క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అతను త్వరలో పుష్ప 2తో పలకరించనుండగా, ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి తప్పక సమయం కేటాయిస్తాడు. అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.
అల్లు స్నేహా రెడ్డి తండ్రి కె చంద్ర శేఖర్ రెడ్డి విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడు అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అల్లుడిగా బన్నీకి 100 మార్కులు వేస్తానని అన్నారు. ‘మాకు అల్లు కుటుంబంతో అనుబంధం ఏర్పడక ముందే..
allu arjun gets 100 marks
నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. నేను చిరు అభిమానిని. ఏదైనా ఫంక్షన్ జరిగితే నాకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇక అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి. బన్నీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అతడి సినిమా పాటలను జమ్మూ కశ్మీర్‌లో కూడా వింటున్నారు. ఇది అల్లు బన్నీ వర్క్‌తోనే సాధ్యమైంది’ చంద్రశేఖర్ అన్నారు.
అల్లు అర్జున్ కట్నంగా ఎంత తీసుకున్నారు అని ప్రశ్నించగా చంద్రశేఖర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అల్లు అర్జున్ అసలు కట్నమే తీసుకోలేదు.. ఆ అవసరం కూడా లేదు. వాళ్ళకే ఎంతో ఆస్తులు ఉన్నాయి. మనం ఇచ్చేది వాళ్ళకి లెక్క కూడా ఉండదు. ఇవన్నీ పక్కన పెడితే కట్నం తీసుకోవడం అల్లు అర్జున్ కి ఇష్టం లేదు. దానికి వాళ్ళు వ్యతిరేకం అని చంద్రశేఖర్ అన్నారు. 2011లో అల్లు అర్జున్, స్నేహ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అల్లు అర్హ, అల్లు అయాన్ సంతానం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు.
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.